నయనతార శింబు, ప్రభుదేవా తో ప్రేమాయణం, బ్రేకప్ తర్వాత దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించింది. కొనేళ్లపాటు ప్రేమించిన నయనతార విగ్నేష్ శివన్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఆ విషయాన్ని సీక్రెట్ గా దాచేసి కొన్నాళ్ల క్రితం విగ్నేష్ ను మరోమారు అంగరంగ వైభవంగా పెళ్లండింది. ఆతర్వాత ఈ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు పేరెంట్స్ గా మారారు. అప్పట్లో అదొక కాంట్రావర్సీ అయ్యింది.
అయితే పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత కవలలు కలిగాక నయనతార-విగ్నేష్ శివన్ తరుచు వెకేషన్స్ అంటూ భార్య-భర్తలు ఎంజాయ్ చెయ్యడమే కాదు పిల్లలతోనూ ట్రిప్స్ వేస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్న పిక్స్ తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే అంత సంతోషంగా ఉన్న జంట విడాకులు తీసుకోబోతుంది అనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అబ్బాయిలు అస్సలు మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా మీవల్ల అంటూ నయనతార సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి వచ్చిన పోస్ట్ చూసి ఆమె అభిమానులే షాకవుతున్నారు.
అయితే నయనతార రెండు రోజుల ముందే పిల్లలతో హ్యాపీ గా ఉన్న పిక్స్ షేర్ చేసింది. అలాంటిది రెండు రోజుల్లోనే విగ్నేష్ తో వివాదం అంటూ పెట్టిన పోస్ట్ నిజమైనది కాదు, అది నయన్ హ్యాండిల్ నుంచి ఎవరో పెట్టారు, నయన్ సోషల్ మీడియా హ్యాండిల్ హ్యాక్ అయ్యి ఉంటుంది అంటూ మాట్లాడుకుంటున్నారు.