విశ్వంభర చిత్రం విడుదల తేదీ పై సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ, మెగా ఫ్యాన్స్ అలక విశ్వంభర మేకర్స్ కి అర్ధం కావడం లేదా, అసలు విశ్వంభర గ్రాఫిక్స్ విషయంలో ఏం జరుగుతుంది. గత ఆరు నెలలుగా వసిష్ఠ ఏం చేస్తున్నారు, విశ్వంభర షూటింగ్ స్టేటస్ ఏమిటి అంటూ మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ లో విశ్వంభర విడుదలకు అనుకూలం, ఒకవేళ సెప్టెంబర్ దాటితే విశ్వంభర విడుదల ఈ ఏడాది ఉండకపోయినా ఉండకపోవచ్చు అనే వార్తలు వారిని మరింతగా టెన్షన్ పెడుతున్నాయి, ఈ ఏడాది సంక్రాంతికి విశ్వంభర విడుదల అన్నారు.. ఆరు నెలలు అయ్యాయి, కొత్త తేదీ ఇవ్వలేకపోతున్నారు, ఇప్పుడేమో వచ్చే ఏడాది వరకు విశ్వంభర రాకపోవచ్చనే వార్తలు మెగా ఫ్యాన్స్ ను అయోమయానికి గురి చేస్తున్నాయి.
మెగాస్టార్ కూడా విశ్వంభర విషయాలేమి మాట్లాడడం లేదు, నాగార్జున కుబేర ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు, ఉస్తాద్ సెట్ లో కనిపించారు, మెగా 157 షూటింగ్ లో బిజీగా వున్నారు. ఎలా ఉన్నా, ఏది ఏమైనా విశ్వంభర విడుదల తేదీపై మెగా మౌనం మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ కు ఛాన్స్ ఇస్తోంది.