క్రిష్ దర్శకత్వంలో అనుష్క చేస్తోన్న హీరోయిన్ సెంట్రిక్ మూవీ ఘాటీ. ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అయ్యి జులై 11 కి చేరింది. జులై 11 న సినిమా రిలీజ్ అంటూ పదిరోజుల ముందు ఫస్ట్ సింగిల్ వదిలిన టీమ్.. ఆ జులై 11 వచ్చేస్తున్నా ట్రైలర్ రిలీజ్ లేదు, ప్రమోషన్స్ లేకుండా కామ్ గా ఉండడం చూసి జులై 11 నుంచి కూడా అనుష్క ఘాటీ పోస్ట్ పోన్ అవ్వనుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు
అందుకే క్రిష్ కానీ ఘాటీ చిత్ర బృందం కానీ అలికిడి లేదు, అసలు అనుష్క మీడియా ముందుకు వచ్చి ఘాటీ ప్రమోషన్స్ లో పాల్గొంటుందా, జులై 11 న ఘాటీ ఉందా, ఉంటే ప్రమోషన్స్ లేవేమిటి ఇలా ఇన్నిఅనుమానాల్లోప్రేక్షకులు కనిపిస్తున్నారు. మరి జులై 11 నుంచి ఘాటీ వాయిదా పడితే మరో కొత్త డేట్ ఎప్పుడిస్తారు అనే మాటలు వినబడుతున్నాయి.
కారణం ఏప్రిల్ లో అనుష్క ఘాటీ పోస్ట్ పోన్ అయినా ఎలాంటి ప్రకటన లేకుండా జూన్ లోనే జులై 11 న ఘాటీ రిలీజ్ అన్న మేకర్స్ ఈసారి కూడా అలానే కామ్ గా పోస్ట్ పోన్ చేస్తారా ఏమిటి అంటూ గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. మరి ఈ వార్తలపై క్రిష్ ఎలా స్పందిస్తారో చూడాలి.