కింగ్ డమ్ క్లారిటీ ఇవ్వరేమిటో

జులై 4 న కింగ్ డమ్ పాన్ ఇండియా మార్కెట్ లో విడుదల అంటూ మేకర్స్ గ్రాండ్ గా డేట్ అనౌన్స్ చేసారు. ఆతరువాత విజయ్ దేవరకొండ అక్కడక్కడా హడావిడి చేసాడు. ఈలోపే కింగ్ డమ్ రీ షూట్స్ అంటూ న్యూస్ రావడం సినిమా విడుదల వాయిదా పడుతుంది అంటూ ప్రచారం జరగడమే కాదు పక్కాగా వాయిదా పడినట్లే కనిపిస్తుంది వ్యవహారం.
అయితే జులై వచ్చేస్తుంది. కింగ్ డమ్ కొత్త రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వడం లేదు. కింగ్ డమ్ రిలీజ్ తేదీ కోసం విజయ్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు నిరాశపరచడంతో.. కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఎంత కోరుకుంటున్నారో, ఆయన అభిమానులు అంతకంటే ఎక్కువే కోరుకుంటున్నారు.
మరి జులై 4నుంచి పోస్ట్ పోన్ అయిన కింగ్ డమ్ రాక ఎప్పుడో మేకర్స్ క్లారిటీ ఇస్తే బావుంటుంది. కన్ఫ్యూజన్ లో ఉన్న వీరమల్లు జులై 24 న వస్తుంది. కింగ్ డమ్ కూడా రిలీజ్ డేట్ ఇస్తే అభిమానులు రిలాక్స్ అవుతారు.
Vijay Deverakonda Kingdom postponed due to technical reasons
Kingdom release date suspense








































