మ‌హిళా ర్యాప‌ర్ మ‌త కల్లోలం

Tue 24th Jun 2025 02:06 PM
tommy genesis  మ‌హిళా ర్యాప‌ర్ మ‌త కల్లోలం
Rapper Tommy Genesis faces backlash మ‌హిళా ర్యాప‌ర్ మ‌త కల్లోలం
Advertisement
Ads by CJ

ఈ వీడియో వీక్షించాక దీనిని మ‌త క‌ల్లోలం అనాలా?  క‌ళ పేరుతో విధ్వంశ ర‌చ‌న అనుకోవాలా? అర్థం కాని అయోమ‌య ప‌రిస్థితి. క‌ళాత్మ‌క‌త‌, క్రియేటివిటీ మాటున ఈ మ‌హిళా ర్యాప‌ర్ సృష్టించిన భీభ‌త్సానికి ప్ర‌పంచం నోరెళ్ల‌బెడుతోంది. దీనిని పాశ్చాత్య పైత్యం అనాలా?  లేక విశృంఖ‌ల నృత్య ప్ర‌క్రియ అనాలా?

 

ఈ కెన‌డియ‌న్ ర్యాప‌ర్ పేరు జెనిసిస్ యాస్మిన్ మోహ‌న్ రాజ్. వ‌య‌సు 34. హాఫ్ త‌మిళియ‌న్. కెన‌డాలో స్థిర‌పడిన ఈ భామ ర్యాప్ సంగీతంతో పాపుల‌రైంది. అయితే తాజాగా `ట్రూ బ్లూ` పేరుతో విధ్వంశ ర‌చ‌న‌కు పాల్ప‌డింది. శ‌రీరానికి బ్లూ పెయింట్ మేక‌ప్ తో చూడ‌గానే కాళీ మాత‌ను అవ‌మానించే రూపాన్ని ఎలివేట్ చేసింది. అదే స‌మ‌యంలో ఈ భామ ఏసుక్రీస్తు శిలువ‌ను చేత‌ప‌ట్టి అస‌భ్య‌క‌ర భంగిమ‌ల‌తో సాగించిన విధ్వంశం అంతా ఇంతా కాదు. ఇటు హిందూ మ‌తాన్ని, అటు క్రిస్టియ‌న్ మ‌తాన్ని కించ‌ప‌రిచింది. మతాల‌ను అనుస‌రించే ప్ర‌జ‌ల్లో క‌ల్లోలం సృష్టించే ప్ర‌య‌త్నం చేసింది.

 

ఒక క‌ళా ప్ర‌క్రియ‌ను ఇంత ఘోరంగా ఎలా ఉప‌యోగించుకోవ‌డం ఈమెకే చెల్లింది. మ‌హిళా ర్యాప‌ర్ యాస్మిన్ మోహ‌న్ రాజ్ ప్ర‌య‌త్నానికి ప్ర‌పంచం నివ్వెర‌పోతోంది. ఏదో ఒక సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ద్వారా ప‌బ్లిసిటీ కోసం యాస్మిన్ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తోంద‌ని నెటిజ‌నులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి ర్యాప‌ర్ కి అంత‌ర్జాలంలో చోటు లేకుండా చేయాల‌ని శాప‌నార్థాలు పెడుతున్నారు.

Rapper Tommy Genesis faces backlash :

  The Internet Thrashes Rapper Genesis  

Tags:   TOMMY GENESIS
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ