Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Crazy leak on Bigg Boss 9 contestants list

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ లిస్ట్ పై క్రేజీ లీక్

బిగ్ బాస్ సీజన్ 9 వచ్చేందుకు మరో రెండు నెలలే సమయం ఉంది. గత సీజన్ కి కన్నడ నటుడు నిఖిల్ విన్నర్ అయ్యాడు. కన్నడ బ్యాచ్ ని స్టార్ మా ఎంకరేజ్ చేస్తుంది అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. బిగ్ బాస్ కి ఎన్ని లీకులొచ్చినా, బిగ్ బాస్ పై ఎన్ని విమర్శలొచ్చినా, తన హోస్ట్ పై ఎన్నిరకాల మటలన్నా నాగ్ వెనకడుగు వెయ్యడం లేదు, యాజమాన్యం కొత్త సీజన్ పై కసరత్తులు మానడం లేదు. 

సీజన్ 9 సెట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో రెడీ అవుతుంది. అంతలోనే బిగ్ బాస్ 9 లోకి వెళ్ళేది వీళ్ళే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. అందులో అలేఖ్య చిట్టి పికిల్స్ అలేఖ్య, అనిల్ గీల, సీరియల్ నటి కావ్య, నటి రీతూ చౌదరి, ప్రదీప్, నటుడు శివ కుమార్, నటి దీపిక, కమెడియన్ ఇమ్మాన్యుయేల్, తేజస్విని గౌడ, వాళ్లతో పాటుగా భార్యాభర్తలైన హారిక, ఏక్‌నాథ్‌లు ఈసీజన్ లో అడుగుపెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. 

ఎక్కువగా సీరియల్ నటులు vs సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సెర్స్ అన్నట్టుగా ఈ సీజన్ ఉంటుంది అనే ప్రచారం ఉంది. మరి ఎవరెవరు సీజన్ 9 లో కనిపిస్తారు, పై లిస్ట్ లో ఎంతమంది బిగ్ బాస్ సీజన్ 9 కి వెళతారు అనేది పక్కనపెడితే ఇప్పుడు మాత్రం ఈ బిగ్ బాస్ సీజన్ 9 లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. 

Bigg Boss 9 update

Crazy leak on Bigg Boss 9 contestants list
bigg boss 9