Advertisement

మహారాజ కు సీక్వెల్ వస్తోంది

విజయ్ సేతుపతి-అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో దర్శకుడు నిథిలన్‌ తెరకెక్కించిన మహారాజ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ సెన్సేషనల్ హిట్ అయ్యింది. విజయ్ సేతుపతి తండ్రి పాత్రలో అద్భుతమైన పెరఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. అనురాగ్ కశ్యప్ విలన్ గా సైకోగా కనిపించారు. మహారాజ చిత్రం అన్ని భాషల్లోనూ మంచి హిట్ అయ్యింది. 

థియేటర్స్ లోనే కాదు మహారాజ ఓటీటీలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. మహారాజ తర్వాత నిథిలన్‌ కు చాలామంది స్టార్స్ ఫోన్ చేసి అవకాశమిస్తా అన్నా నిథిలన్‌ మాత్రం తన కొత్త ప్రాజెక్ట్ ని ఇంతవరకు అనౌన్స్ చెయ్యలేదు. అయితే నిథిలన్‌ ఇప్పుడు మహారాజ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. 

ప్రస్తుతం మహారాజ సీక్వెల్ స్క్రిప్టు పనులు చివరి దశలో ఉన్నాయని.. నిథినల్ అన్ని పూర్తి చేసి డేట్స్ కావాలని ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి విజయ్ సేతుపతి రెడీగా ఉన్నారని.. త్వరలోనే మహారాజ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం

Vijay Sethupathi Big Sequel Plan Finally Revealed!

Maharaja is getting a sequel
maharaja