Advertisement

వీరమల్లు ప్రమోషన్స్ లో ఉండాల్సిన క్రిష్ కానీ..

క్రిష్ దర్శకుడిగా పవన్ కళ్యాణ్ తో మొదలు పెట్టిన హరి హర వీరమల్లు చిత్రం గత నాలుగేళ్లుగా సెట్ పైనే ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో హరి హర వీరమల్లు షూటింగ్ నత్తనడకన సాగుతూ ఉండడంతో.. ఓ 70 శాతం షూటింగ్ అయ్యాక దర్శకుడు క్రిష్ నెమ్మదిగా ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికొచ్చేసి కొద్దిరోజులు బ్రేక్ తీసుకుని అనుష్క తో ఘాటీ మొదలు పెట్టి చకచకా ఫినిష్ చేసి రిలీజ్ కి సిద్ధం చేసేసారు. 

హరి హర వీరమల్లు రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ ఇంకా విడుదల తేదీ ఇవ్వకుండా స్ట్రగుల్ అవుతుంది. వీరమల్లు మేకర్స్ పై అమెజాన్ ప్రైమ్ వారు ఒత్తిడి చేస్తున్నా.. సరైన డేట్ ఇవ్వలేకపోతున్నారు. మరోపక్క వీరమల్లు వదిలేసాక ఘాటీ ని పూర్తి చేసి జులై 11న విడుదల కు సిద్ధం చేసిన క్రిష్ కి ఇప్పుడు ఘాటి ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. 

జూన్ 21 శనివారం ఘాటీ నుంచి ఫస్ట్ సింగల్ తో ఘాటీ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు క్రిష్. హరి హార్ వీరమల్లు ఎలా ఉన్నా.. ప్రస్తుతం క్రిష్ ఘాటీ ప్రమోషన్స్ లో బిజీ కాబోతున్నారు. ఘాటీ ప్రమోషన్స్ లో ఆయన హరి హర వీరమల్లు ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మరి వీరమల్లు ప్రమోషన్స్ లో ఉండాల్సిన క్రిష్ ఇలా ఘాటీ ప్రమోషన్స్ లో కనిపించబోతున్నారన్నమాట.  

Ghaati first single release date locked

Ghaati release on July 11th
ghaati