ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Crazy news about Megastar role in Mega 157

Mega 157 లో మెగాస్టార్ రోల్ పై క్రేజీ న్యూస్

Crazy news about Megastar role in Mega 157Crazy news about Megastar role in Mega 157

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి తో #Mega157 లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆడుతూ పాడుతూ చిరు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం #Mega 157 టీమ్ ముస్సోరిలో ఉంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ నయనతార కూడా జాయిన్ అయ్యారు. 

అయితే చిరు ని అనిల్ రావిపూడి #Mega 157 లో ఎలా చూపిస్తారు, వెంకీని సంక్రాంతికి వస్తున్నాం లో చాలా ఫన్నీ గా, పోలీస్ గా చూపించారు, ఇప్పుడు మెగాస్టార్ కి ఎలాంటి కేరెక్టర్ ఇచ్చి ఆ ఫన్ ని జనరేట్ చేస్తారనే విషయంలో మెగా ఫ్యాన్స్ చాలా క్యూరియాసిటీగా ఉన్నారు. తాజాగా #Mega 157 లో అనిల్ రావిపూడి స్కూల్‌ డ్రిల్ మాస్టర్ పాత్రలో చిరు నటనలో మరో కొత్త కోణాన్ని చూపించబోతున్నారు అని తెలుస్తుంది. 

ఆ పాత్రలో చిరు కామెడీ టైమింగ్ తో పాటుగా ఏమోషన్ డ్రామా ను కూడా పండిస్తారని అంటున్నారు, అదే స్కూల్ లో నయనతార టీచర్ గా కనిపిస్తారని టాక్. ప్రస్తుతం ముస్సోరిలో #Mega 157 కి సంబంధించి స్కూల్ నేపథ్యంగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట అనిల్ రావిపూడి. ఇందులో డ్రిల్ మాస్టర్ పాత్రగా చిరంజీవి లుక్ ఎంతో స్పెషల్‌గా ఉండనుందని సమాచారం.

Chiranjeevi As Drill Master In Chiru-Anil

chiranjeevi