వైసీపీ కీలకనేత అరెస్ట్

ఏపీ లిక్కర్ కేసు లో మరో వికెట్ డౌన్ అయ్యింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేరారు. బెంగుళూరు నుంచి కొలంబియా వెళ్లేందుకు ప్రయత్నించిన చెవిరెడ్డిని ఎయిర్ పోర్ట్ పోలీసులు అడ్డుకున్నారు. చెవిరెడ్డిపై పోలీసులు ఇదివరకే లుక్ అవుట్ నోటీసు జారీ చేసి ఉండటంతో ఎయిర్ పోర్ట్ అధికారులు చెవిరెడ్డిని అడ్డుకుని ఏపీ సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. . 

సిట్ అధికారులు చెవిరెడ్డిని బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లోనే అదుపులోకి తీసుకున్నారు. చెవిరెడ్డితో పాటుగా ఆయనకు అత్యంత సన్నిహితుడు, లిక్కర్ స్కామ్ లో మరో నిందుతుడు వెంకటేశ్ నాయుడు ని కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని ఈరోజు బుధవారం ఉదయం బెంగుళూరు నుంచి ఏపీకి తరలిస్తున్నారు. 

లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడైన రాజ్ కసిరెడ్డి నుంచి మద్యం ముడుపుల డబ్బు పెద్ద ఎత్తున చెవిరెడ్డి భాస్కరరెడ్డికి చేరిందని, ఆ డబ్బు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేశారని సిట్ అధికారుల విచారణలో గుర్తించడంతో చెవిరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ కు ప్రయత్నం చెయ్యగా చెవిరెడ్డి పోలీసులకు దొరకలేదు, దానిలో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీఅయ్యాయి. 

ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు చెవిరెడ్డి బెంగుళూరు ఎయిర్ పోర్ట్ నుంచి శ్రీలంక రాజధాని కొలంబియా కి వెళ్లే క్రమంలో ఆయన ఎయిర్ పోర్ట్ పోలీసులకు పట్టుబడ్డారు. 

Liquor scam : Ex-MLA Chevireddy detained at Bengaluru airport

Chevireddy arrested in liquor scam
cheviredd