Advertisement

స‌డెన్‌గా షాకిచ్చిన ఇలియానా

గోవా బ్యూటీ ఇలియానా ఇటీవ‌ల పూర్తిగా వ్య‌క్తిగ‌త జీవితంపైనే దృష్టి సారిస్తోంది. ఈ భామ సైలెంట్ గా విదేశీ ప్రియుడు మైఖేల్ డోల‌న్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. అంత‌కుముందు కొన్నేళ్ల పాటు ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ చేసిన ఇలియానా, అటుపై బ్రేక‌ప్, డిప్రెష‌న్ వ‌గైరా వ్య‌వ‌హార‌ల‌తో ఆటుపోట్లు ఎదుర్కొంది. కానీ డోల‌న్ తో ఇలియానా డేటింగ్ లైఫ్ జోయ్ ఫుల్ గా సాగింది.

 

ఇప్ప‌టికే కోవా పీనిక్స్ డోల‌న్ అనే బిడ్డ‌కు ఇలియానా- డోల‌న్ త‌ల్లిదండ్రులు. గ‌త అక్టోబ‌ర్ లో రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తున్న విష‌యాన్ని కూడా ఇలియానా అధికారికంగా ప్ర‌క‌టించింది. అయితే ఇటీవ‌ల కొంత కాలంగా స్థ‌బ్ధుగానే ఉంది ఇల్లీ. కానీ ఇప్పుడు స‌డెన్ గా ఫాద‌ర్స్ డే నాడు ఒక ఫోటోని షేర్ చేసి డోల‌న్ కి నివాళి ఇచ్చింది. ఈ ఫోటోగ్రాఫ్ లో మైఖేల్ డోల‌న్ ఎంతో ఆనందంగా త‌న బిడ్డ‌ను ముద్దాడుతూ క‌నిపించాడు. అది డోల‌న్‌- ఇల్లీ దంప‌తుల‌కు జ‌న్మించిన రెండో బిడ్డ అని అర్థమ‌వుతోంది. మీరు అద్బుత‌మైన ఉత్త‌మ‌మైన‌ తండ్రి అంటూ డోల‌న్ ని ఇలియానా పొగిడేస్తూ, ఒక సుదీర్ఘ పోస్ట్ ని షేర్ చేసింది. మొత్తానికి ఇలియానా త‌న రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యాన్ని అధికారికంగా ధృవీక‌రించింద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇలియానా కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

Ileana Announce Second Child Birth

Ileana Drops Newborn Pic With Michael
ileana