Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Maruti gives clarity on Raja Saab sequel

రాజా సాబ్ సీక్వెల్ పై మారుతి హాట్ కామెంట్స్

ఫైనల్లీ రాజా సాబ్ టీజర్ వచ్చింది. అది ఫ్యాన్స్ కి ఎంత నచ్చింది అనే విషయం పక్కనపెడితే.. దర్శకుడు మారుతి తో ప్రభాస్ సినిమా చెయ్యడం పై ఎంతగా ట్రోల్స్ నడిచాయో అనేది ఈ టీజర్ పూర్తిగా మాఫీ చేసింది అనే చెప్పాలి, మారుతి ప్రభాస్ తో చిన్న చితక సినిమా చెయ్యట్లేదు, బిగ్ స్కెల్ తోనే రాజా సాబ్ ని తెరకెక్కిస్తున్నారనేది రాజా సాబ్ టీజర్ తో స్పష్టత వచ్చింది. 

అంతేకాదు రాజా సాబ్ సినిమాపై ఆ సినిమా క్లైమాక్స్ పై దర్శకనిర్మాతలు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రాజా సాబ్ నిడివి మూడు గంటలు అంటూ మారుతి క్లారిటీ ఇవ్వడమే కాదు, రాజా సాబ్ పార్ట్ 2 ఉంటుందా అనే ప్రశ్నకు ఆయన ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. పార్ట్ 2 తియ్యాలని బలవంతంగా కథను సాగదీయాలనే ఆలోచన లేదు, కంగారు పడొద్దు. నటీనటులకైనా టెక్నీకల్ టీం కైనా ఎనిమిదిగంటల పనివేళలు ఉన్నప్పటికి.. మా సినిమా కోసం మేము 18 గంటలు పని చేసిన రోజూ కూడా ఉన్నాయని మారుతి చెప్పారు. 

మార్నింగ్ 6 కి స్టార్ట్ అయితే నైట్ 11వరకు షూట్ చేసే వాళ్ళం, ఇలా సుమారు 120 డేస్ చేసాము అంటూ నిర్మాత టీజీ విశ్వపసాద్ చెప్పారు. అంతేకాకుండా రాజా సాబ్ క్లైమాక్స్ పై ఆయన చేసిన కామెంట్స్ మరింతగా అంచనాలు పెంచేసాయి. రాజా సాబ్ క్లైమాక్స్ 40 నిమిషాలు అద్భుతంగా ఉంటుంది, విఎఫ్ ఎక్స్ పనుల కోసం దాదాపుగా 300 రోజులు వెచ్చించాము అంటూ రాజా సాబ్ క్లైమాక్స్, అలాగే షూటింగ్ ఇంకా చాలా విషయాలను మీడియా మిత్రులతో పంచుకున్నారు. 

Maruthi Rejects Two-Part Release Idea for The Raja Saab

Maruti gives clarity on Raja Saab sequel
maruthi