ఏపీలోనే కాదు టీజీ లోను లోకేష్ కు సపోర్ట్

సీఎం చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని, లోకేష్ కు పార్టీ ప్రధానకార్యదర్శి హోదా ఇవ్వాలంటూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు కోరడమే కాదు, టీడీపీ సీనియర్ నేతలైతే చంద్రబాబు కి రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న లోకేష్ ను పార్టీకి ప్రధాన కార్యదర్శిగా చేస్తే మరింత బాధ్యతగా ఉంటారని, లోకేష్ కి టీడీపీ ని నడిపించే సత్తా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
కేవలం ఏపీలోనే కాదు.. లోకేష్ కు తెలంగాణ లోను సపోర్ట్ లభిస్తుంది. లోకేష్ కి పార్టీ బాధ్యతలు అప్పగించాలి అంటూ తెలంగాణ MIM పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుకి అసదుద్దీన్ ఓవైసీ సలహా ఇస్తున్నారు.
లోకేష్ కు టీడీపీ పార్టీ ని అప్పగించాలని... పద్నాలుగేళ్ల పాలించావు ఇక చాలు అంటూ చంద్రబాబు కి అసదుద్దీన్ ఓవైసీ సలహా ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. లోకేష్ భవిష్యత్తును నాశనం చేయవద్దని.. లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు ఎందుకు ఆలస్యం, ఆలోచన అంటూ చంద్రాబాబుకి అసదుద్దీన్ ఓవైసి సలహా ఇస్తున్నారు. మరి ఈలెక్కన లోకేష్ కి తెలంగాణలోనూ సపోర్ట్ దొరికినట్టే. ఈ విషయంలో చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Asaduddin Owaisi Serious Comments on Chandrababu and Nara Lokesh
Asaduddin Owaisi Sensational Comments On Chandrababu








































