Advertisement

సోనియాగాంధీ హెల్త్ అప్ డేట్

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఆమె కొన్నాళ్లుగా తరచూ అనారోగ్యం బారిన పడడం కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు ఆందోళన కలిగిస్తుంది. తాజాగా సోనియాగాంధీ ఆరోగ్యం మరోసారు పాడైంది. దానితో ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

కొద్ధిరోజులుగా సోనియా గాంధీ ఉదర సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఆమెను సోనియా వ్యక్తిగత సిబ్బంది హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో జాయిన్ చెయ్యగా.. ఆమెకు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో చికిత్స అందించినట్లుగా చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. 

సోనియా గాంధీ హెల్త్ అప్డేట్ ఇస్తూ.. సోనియాగాంధీ ఉదర సంబంధిత సమస్య కారణంగా నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల బృందం ఆమె ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోంది అని తెలిపారు. 

Sonia Gandhi Health Stable Now, Under Close Medical Watch

Sonia Gandhi Health Update
sonia gandhi