Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Aamir Khan refuses cuts suggested by CBFC

మొండిత‌నంతో రిలీజ్ ఆపుకున్న హీరో

ఈ హీరో మొండిత‌నం కొంప ముంచేట్టే ఉంది! పంట ఫ‌క్వానికి వ‌చ్చి చేను కోసే ముందు నీట మునిగిన‌ చందంగా, ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ ముందుకు వ‌చ్చి ఆగిపోయేట్టు క‌నిపిస్తోంది. సీబీఎఫ్‌సి స‌ర్టిఫికేష‌న్ అవ్వ‌క‌పోవ‌డం ఇబ్బందుల్లోకి నెడుతోంది. అస‌లింత‌కీ ఏం జ‌రిగింది?  ఏ సినిమా విషయంలో.. హీరో ఎవ‌రు? అంటే.. వివ‌రాల్లోకి వెళ్లాలి.

 

మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ స్వ‌యంగా న‌టించి, నిర్మించిన ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `సీతారే జ‌మీన్ ప‌ర్` రిలీజ్ ముంగిల సెన్సార్ ట్ర‌బుల్స్ ని ఎదుర్కొంటోంది. ఈ సినిమాకి యూకే సెన్సార్ బోర్డ్ 12 ఏ రేటింగ్ ఇచ్చింద‌ని స‌మాచారం. సుమారు రెండున్న‌ర గంట‌ల నిడివితో ఉన్న ఈ సినిమాని అమీర్ ఖాన్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 3000 నుంచి 3500 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసారు. 20 జూన్ రిలీజ్ తేదీ. కానీ నాలుగు రోజుల ముందు ఇండియాలో సెన్సార్ గ‌డ‌పపై చిక్కులు త‌లెత్తాయి. ఈ సినిమా నుంచి రెండు సీన్లు తొల‌గించాల్సిందిగా సెన్సార్ బోర్డ్ సూచించింది. కానీ అమీర్ ఖాన్ దానికి స‌సేమిరా అన్నార‌ట‌. దీంతో సెన్సార్ పూర్త‌యి స‌ర్టిఫికెట్ రాలేదు. అమీర్ ఇప్ప‌టికీ బోర్డ్ స‌భ్యుల‌ను అభ్య‌ర్థిస్తున్నాడు. ఆ సీన్లు తొల‌గించ‌డం కుద‌ర‌దని భీష్మించుకు కూచున్నాడ‌ట‌. కార‌ణం ఏదైనా ఇంకా సెన్సార్ స‌ర్టిఫికెట్ రాలేదు. దీన‌ర్థం ముందే ప్ర‌క‌టించిన స‌మ‌యానికి సినిమా రిలీజ‌వుతుందా లేదా చెప్ప‌లేని స్థితి.

 

సెన్సార్ పూర్త‌యితేనే అడ్వాన్స్ బుకింగులు మొద‌ల‌వుతాయి. కానీ దీనికి ఇంకా లైన్ క్లియ‌ర్ కాక‌పోవ‌డంతో `సీతారే జ‌మీన్ ప‌ర్` విడుద‌ల‌వుతుందా లేదా? అనే సందిగ్ధ‌త నెల‌కొంది. అమీర్ ఖాన్ న‌టించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తారే జ‌మీన్ ప‌ర్ కి ఇది సీక్వెల్. ఆర్.ఎస్.ప్ర‌స‌న్న ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అమీర్ ఖాన్ కొంద‌రు మాన‌సిక విక‌లాంగుర టీమ్ కి కోచ్ గా ఈ చిత్రంలో న‌టించారు.

Sitaare Zameen Par; censor certificate pending

Aamir Khan refuses cuts suggested by CBFC
aamir khan