Advertisementt

టాలీవుడ్ కి రేవంత్ రెడ్డి అంటే భక్తా? భయమా?

Sun 15th Jun 2025 05:55 PM
revanth reddy  టాలీవుడ్ కి రేవంత్ రెడ్డి అంటే భక్తా? భయమా?
Revanth Reddy woos Tollywood టాలీవుడ్ కి రేవంత్ రెడ్డి అంటే భక్తా? భయమా?
Advertisement
Ads by CJ

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగిన టాలీవుడ్ ఇండస్ట్రీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వాళ్లతో కానీ, సీఎం రేవంత్ రెడ్డి తో కానీ అంటీముట్టనట్టుగా ఉన్నారు. సన్నిహిత సంబంధాలతో కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత పెద్ద డ్రగ్ కేసు నుంచి అయినా సినీ ప్రముఖులు బయటపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంతో అంటీముట్టనట్టుగా ఉన్న సినీ ప్రముఖులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన షాక్ లు అన్ని ఇన్ని కావు. నాగార్జున N కన్వెన్షన్ పడగొట్టడం, అల్లు అర్జున్ లాంటి స్టార్ ని జైల్లో పెట్టడం అన్ని రేవంత్ రెడ్డి ఇండస్ట్రీపై కక్ష తీర్చుకునేలా ఉన్నాయనే అభిప్రాయాలు బలపడ్డాయి. 

అంతేకాదు నంది అవార్డ్స్ స్థానంలో గద్దర్ అవార్డ్స్ అంటూ రేవంత్ కొత్త చర్చకు తెర లేపారు. గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రకటించినప్పుడు ఎవ్వరూ ఇంట్రెస్టు చూపించలేదు. ఫైనల్ గా రేవంత్ రెడ్డి గద్దర్ ఫిలిం అవార్డ్స్ కోసం ఓ కమిటీ వేసి సినిమా ప్రముఖులను ఒక చోట చర్చే కార్యక్రమాన్ని చేపట్టారు. కమిటీ మెంబెర్స్ ఇచ్చిన లిస్ట్ ల ప్రకారం జూన్ 14 శనివారం సాయంత్రం హైదరాబాద్ హైటెక్స్ లో కనివిని ఎరుగని రీతిలో తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. 

అయితే ఇలాంటి అవార్డులను సినీ ప్రముఖులు, ముఖ్యంగా స్టార్ హీరోలు అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ గత రాత్రి జరిగిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ లో అవార్డు వచ్చిన ప్రతి ఒక్క స్టార్ హీరో పాల్గొన్నారు. బాలకృష్ణ దగ్గర నుంచి అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, తేజ సజ్జ, పూజ హెగ్డే, కృతి శెట్టి, రీతూ వర్మ.. ఇలా చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించడం, అందులో స్టార్స్ కలర్ ఫుల్ గా పాల్గొనటం చూసి ఇదంతా రేవంత్ రెడ్ది మీద భక్తా, లేదంటే భయమా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజెన్లు. 

ఇక గద్దర్ ఫిలిం అవార్డ్స్ లో అవార్డులు అందించిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఇచ్చిన స్పీచ్ చూస్తే రేవంత్ రెడీ సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా ఉన్నారనేది అర్ధమవుతుంది. ఒకవేళ ఎదురిస్తే ఏమవుతుందో శాంపిల్ చూసే ఉన్నారు.. అది లెక్క. రేవంత్ రెడ్డా మజాకానా..!

Revanth Reddy woos Tollywood :

CM Revanth Reddy About Tollywood  Development

Tags:   REVANTH REDDY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ