Advertisementt

అఖండ 2: తాండవం పై క్రేజీ అప్ డేట్

Sun 15th Jun 2025 06:02 PM
akhanda 2  అఖండ 2: తాండవం పై క్రేజీ అప్ డేట్
Crazy update on Akhanda 2 అఖండ 2: తాండవం పై క్రేజీ అప్ డేట్
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ,  బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ అఖండ 2: తాండవ కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుదని టీమ్ కాన్ఫిడెన్స్ చూపిస్తుంది. 

ఇటివలే జార్జియాలోని గ్రాండ్ లోకేషన్స్ లో కీలకమైన యాక్షన్  సీన్స్ ని షూట్ చేశారు. ఆతర్వాత అంటే రేపటి నుంచి ఆర్‌ఎఫ్‌సీలో అఖండ 2 కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణతో పాటు యూనిట్ అంతా పాల్గొంటున్నారు. సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశాలని చిత్రీకరించనున్నారు.  బాలకృష్ణ పుట్టినరోజుకు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కు నేషనల్ వైడ్ గా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ తో టీజర్ అదరగొట్టింది.  

టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. డైనమిక్ ఆది పినిశెట్టి ఇంటెన్స్ పాత్రని పోషిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న అఖండ 2 పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Crazy update on Akhanda 2:

Akhanda 2 Thaandavam shooting update 

Tags:   AKHANDA 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ