జగన్ పై రేణుక చౌదరి ఫైర్

రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ నాయకురాలు రేణుక చౌదరి జగన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. లేడీ టైగర్ మాదిరి రేణుక చౌదరి రాజకీయాల్లో తనదైన మార్క్ తో కొనసాగుతున్నారు. ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టే రేణుక చౌదరి తాజాగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చెయ్యడానికి కారణం అమరావతి మహిళలపై జర్నలిస్ట్ కృష్ణంరాజుతో పాటు యాంకర్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు లు చేసిన అసభ్యకర కామెంట్స్.
వాటిని సమర్ధించిన జగన్ పై రేణుక చౌదరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం కృష్ణంరాజు, జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు, సాక్షి యజమాన్యంపై ఫిర్యాదులు, కేసులు నడుస్తున్నాయి. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు మానసిక చికిత్సను తాను ఉచితంగా చేయిస్తానని, జగన్ తీరు దున్నపోతు మీద వర్షం పడిన చందంగా ఉందని ఘాటైన వ్యాఖ్యలు చేసారు ఆమె.
అమరావతిపై వైఎస్ జగన్ కక్షసాధింపు అందరికీ తెలుసు, మహిళలను జగన్ చాలా తక్కువగా అంచనా వేశారు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నా బుద్ది రాలేదు అంటూ.. సాక్షి పేపరు, సదరు టీవీని ముందు మూసివేయాలని రేణుక చౌదరి డిమాండ్ చేశారు.
MP Renuka Chowdhury fires on Ys Jagan
Renuka Chowdhury fires on Jagan







































