Advertisement

Ads by CJ

మినీ రివ్యూ: టూరిస్ట్ ఫ్యామిలీ

Sun 08th Jun 2025 04:10 PM
tourist family  మినీ రివ్యూ: టూరిస్ట్ ఫ్యామిలీ
Tourist Family mini review మినీ రివ్యూ: టూరిస్ట్ ఫ్యామిలీ
Advertisement
Ads by CJ

తమిళనాట చిన్న సినిమాగా తెరకెక్కి సెలబ్రిటీస్ చేత పొగిడించుకుంటున్న టూరిస్ట్ ఫ్యామిలీ థియేటర్స్ లో పెద్ద హిట్ అయ్యింది. ఆడియన్స్ మౌత్ టాక్ ఈ చిన్న సినిమాని పెద్ద హిట్ చేసింది. సోషల్ మీడియాలో టూరిస్ట్ ఫ్యామిలీ  గురించిన పాజిటివ్ మాటలు, సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్, దర్శకధీరుడు రాజమౌళి, హీరో నాని లాంటి సెలబ్రిటీస్ మెచ్చిన ఈ టూరిస్ట్ ఫ్యామిలీ ఇప్పుడు పాన్ ఇండియాలోని పలు భాషల్లో జియో హాట్ స్టార్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో వీక్షించి అందరూ తెగ పొగిడేస్తున్నారు. టూరిస్ట్ ఫ్యామిలీ స్వీట్ అండ్ క్యూట్ ఫ్యామిలీ అంటూ పొగిడినవారే కానీ పొగడని వారు లేదు. 

టూరిస్ట్ ఫ్యామిలీ మినీ స్టోరీ : 

శ్రీలంక లో పరిస్థితులు బాగోక సముద్రం ద్వారా అక్రమంగా తమిళనాడులోకి ప్రవేశించి శరణార్థులుగా ఓ కాలనిలో అద్దెకు దిగిన ధర్మదాస్, అతని భార్య ఇద్దరు కొడుకులు ఆ కాలనీ వాళ్లతో ఎలా కలిసోయారో, బాంబ్ బ్లాస్ట్ విషయంలో పోలీసులు ఆ ఫ్యామిలీ కోసం ఎందుకు వెతికింది అనేది సింపుల్ గా టూరిస్ట్ ఫ్యామిలీ స్టోరీ. 

శ్రీలంక నుంచి వచ్చేసిన ఓ ఫ్యామిలీ తమిళనాడులో శరణార్థులుగా ఎలా తల దాచుకుంది, ఈ క్రమంలో ఆ కాలనీ వాళ్లతో ఎలా కలిసిపోయింది అనే దాన్ని దర్శకుడు చక్కగా కాదు కాదు స్వీట్ గా చూపించాడు. ఆ కాలనిలో ఒకరితో ఒకరు కలవకుండా, ఎవరిని ఎవరూ పట్టించుకోకుండా, ఒకరితో కలిసి మాట్లాడితే ఏమవుతుందో అన్నట్టుగా ఉండే కుటుంబాల నడుమ దిగిన ధర్మదాస్ ఫ్యామిలీ.. 15 రోజుల్లోనే ఆ కాలనీ వారిని మార్చిన తీరు కి ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. లైఫ్ అంటే సింగిల్ బ్రతుకు కాదు, గొప్పగా బ్రతకడము కాదు.. నలుగురితో కలిసి సరదాగా బ్రతకడం అంటూ టూరిస్ట్ ఫ్యామిలీని దర్శకుడు తెరకెక్కించిన తీరు ప్రసంశనీయం. 

ధర్మదాస్ గా శశికుమార్, వాసంతి గా సిమ్రాన్, వారి కొడుకులుగా నీతూ షాన్ మిథున్, మురళి కమలేశ్ మాత్రమే కాదు, ఆ కాలనిలో కనిపించిన ఆర్టిస్ట్ లు అందరూ తమ తమ పాత్రలకు జీవం పోశారు. అరవింద్ విశ్వనాథన్ ఫొటోగ్రఫీ, సీన్ రోల్డన్ సంగీతం, భరత్ విక్రమన్ ఎడిటింగ్ అన్ని టూరిస్ట్ ఫ్యామిలీకి కావాల్సినంత సపోర్ట్ చేశాయి. 

టూరిస్ట్ ఫ్యామిలీ చిన్న కథే కానీ.. అందరిని ఆలోచింప చేసేకథ. అందుకే ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవుతున్నారు.. మరి మీరు మిస్ కాకుండా ఓసారి చూసెయ్యండి ఈ టూరిస్ట్ ఫ్యామిలీని.  

Tourist Family mini review:

Tourist Family Telugu Movie Review

Tags:   TOURIST FAMILY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ