Advertisement

Ads by CJ

అఖిల్ లెనిన్ కోసం స్పెషల్ భామ

Sun 08th Jun 2025 03:08 PM
akhil  అఖిల్ లెనిన్ కోసం స్పెషల్ భామ
Special song to Akhil Lenin అఖిల్ లెనిన్ కోసం స్పెషల్ భామ
Advertisement
Ads by CJ

అక్కినేని ప్రిన్స్ అఖిల్ పెళ్లి పీటలెక్కాడు, శుక్రవారం జూన్ 6 తెల్లవారుఝామున అఖిల్ పెళ్లి హైదరాబాద్ లోని నాగార్జున ఇంట్లో అతికొద్దిమంది సన్నిహితుల నడుమ అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఈరోజు ఆదివారం అంటే జూన్ 8 న అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ ను నాగార్జున గ్రాండ్ గా ప్లాన్ చేసారు. పర్సనల్ గా అఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. 

ఇక అఖిల్ ఏజెంట్ తర్వాత రెండేళ్లు బ్రేక్ తీసుకుని లెనిన్ చిత్రం చేస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌లో అఖిల్ నటిస్తున్న లెనిన్ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ ను అఖిల్ బర్త్ డే సందర్భంగా వదిలారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతుంది.

అయితే తాజాగా లెనిన్ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. హీరోయిన్ శ్రీలీల కాగా స్పెషల్ సాంగ్ కోసం ఓ టాప్ హీరోయిన్ ని అప్రోచ్ అవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ వన్ మంత్ గ్యాప్ లో సాంగ్ ను షూట్ చెయ్యాలని, తర్వాత అఖిల్ షాట్స్ ను సాంగ్ లో యాడ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. మరి అఖిల్ లెనిన్ స్పెషల్ సాంగ్ కోసం ఏ భామ దిగుతుందో చూడాలి. 

Special song to Akhil Lenin:

Akhil Lenin update

Tags:   AKHIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ