Advertisementt

నందమూరి ఫ్యాన్స్ కు రెండు పవర్ ఫుల్ ట్రీట్స్

Sun 08th Jun 2025 12:58 PM
balakrishna  నందమూరి ఫ్యాన్స్ కు రెండు పవర్ ఫుల్  ట్రీట్స్
NBK111- A New Epic Project నందమూరి ఫ్యాన్స్ కు రెండు పవర్ ఫుల్ ట్రీట్స్
Advertisement
Ads by CJ

జూన్ 10 నందమూరి నటసింహ బాలకృష్ణ బర్త్ డే. అసలే ఈ బర్త్ డే బాలయ్య అందులోను నందమూరి అభిమానులకు చాలా ప్రత్యేకం. కారణం ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య కి అభిమానులు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అటు పద్మభూషణ్ అవార్డు వేడుకలు.. ఇటు బాలయ్య బర్త్ డే మూవీ ట్రీట్స్ తో నందమూరి అభిమానులు ఫుల్ గా సర్ ప్రైజ్ అవుతున్నారు. 

జూన్ 1 న ఆయన బర్త్ డే, దానికన్నా ముందే నందమూరి అభిమానులకు అందాల్సిన స్పెషల్ ట్రీట్స్ అందేస్తున్నాయి. అందులో మొదటిది వీరసింహ సింహ రెడ్డి దర్శకుడు గోపీచంద్ తో బాలయ్య మరోమారు జట్టు కడుతున్నారు. దానికి సంబందించిన అంటే NBK 111 ఎనౌన్సమెంట్ ఈ రోజే జూన్ 8న వచ్చేసింది. బాలయ్య-గోపీచంద్ మలినేని ఫిలిం అనౌన్సమెంట్ తోనే అభిమానుల్లో ఊపు వచ్చింది. 

ఇక బర్త్ డే కి ఒక రోజు ముందే అంటే రేపు జూన్ 9 సాయత్రమే అభిమానుల కోసం మరో ట్రీట్ రెడీ అవుతుంది. అదే బాలయ్య - బోయపాటిల క్రేజీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ తాండవం టీజర్ రాబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసేసారు. మరి నందమూరి అభిమానులకు బాలయ్య బర్త్ డే కన్నా ముందే రెండు క్రేజీ పవర్ ఫుల్ ట్రీట్స్ అందుతున్నాయన్నమాట. 

NBK111- A New Epic Project:

Nandamuri Balakrishna Akhanda 2 Thandavam Teaser On June 9

Tags:   BALAKRISHNA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ