Advertisement

అఖిల్ పెళ్లి ఎందుకింత సింపుల్

అక్కినేని ప్రిన్స్ అఖిల్ పెళ్లి అంటే ఎలా ఉండాలి, అంగరంగ వైభవంగా, ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి గ్రాండ్ గా జరగాలి. కానీ అఖిల్ పెళ్లిని నాగార్జున తన ఇంట్లోనే అతికొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహతులు నడుమ జరిపించడం హాట్ టాపిక్ అయ్యింది. అఖిల్ పెళ్ళిలో మెగాస్టార్ ఫ్యామిలీ, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ, నాగ్ కి అత్యున్నత సన్నిహితురాలు శిల్ప రెడ్డి తప్ప ఎవ్వరూ కనిపించలేదు. 

అంతేకాకుండా కళ్ళు మిరిమిట్లు గొలిపే పెళ్లి పందిరి కూడా కనిపించలేదు. అఖిల్ అలాగే జైనాబ్ లు చాలా సింపుల్ గా సాంప్రదాయ దుస్తుల్లో అంటే అఖిల్ వైట్ పంచె కట్టు, జైనాబ్ వైట్ శారీలో కనిపించారు. ఇక నాగార్జున, అమల, నాగ చైతన్య, శోభిత అంతా ట్రెడిషనల్ గా కనిపించారు. అయితే నాగార్జున అఖిల్ పెళ్లిని సింపుల్ గా తేల్చేసి రిసెప్షన్ ని భారీగా చెయ్యడం వెనుక ఓ కారణమనముంది అనే మాట వినబడుతుంది. 

అక్కినేని ఇంట పెళ్లిళ్లు అంతగా కలిసి రాలేదు అని, నాగార్జున ఈ డెసిషన్ తీసుకున్నారట. నాగ చైతన్య మొదటి వివాహం బ్రేకప్ అవ్వగా, అఖిల్ మొదటి ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయ్యింది, అలాగే సుమంత్ పెళ్లి కూడా విడాకులకు దారి తీసింది, అందుకే నాగార్జున అఖిల్ పెళ్లిని ఎలాంటి హడవిడి లేకుండా సింపుల్ గా కానిచ్చేసి రిసెప్షన్ మాత్రం తన హోదాకు తగినట్లుగా అంగరంగ వైభవంగా జరిపించేందుకు రేపు ఆదివారం సాయంత్రం ఏర్పాట్లు చేస్తున్నారు. 

Akhil ties the knot with artist Zainab Ravdjee in an intimate ceremony

Akhil ties the knot with Zainab
akhil