గత ఏడాది ఎన్నికల్లో గెలిచి పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీజీ, జనసేన కూటమిగా ఏర్పాటు కావడంతోనే పవన్ కి గెలుపు నల్లేరు మీద నడకలా పూర్తయింది. గత ఎన్నికల్లో పీకే రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు సహకారం తీసుకుని గెలుపు గుర్రం ఎక్కారు. బీజీపేతో వ్యక్తిగతంగా ప్రధాని మోదీతో పవన్ సాన్నిహిత్యం మరింత బలపడింది. పవన్ పేరిట గత ఏడాది సాద్యమైన రికార్డు ఇది. రాజకీయ చరిత్రలో నిలిచిపోయింది.
మరి సినీ చరిత్రలో 2025లో అలాంటి రికార్డుకు ఏదైనా ఆస్కారం ఉందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఏడాదికి ఒక సినిమా చేయడమే కష్టం. ఆసినిమా కూడా అతి కష్టం మీద రిలీజ్ అవుతుంది. అయితే ఒకే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేసిన ఘనత మాత్రం ఉంది మూడు నాలుగుసార్లు జరిగింది. 2006, 2011, 2012 సంవత్సరాల్లో మాత్రం ఏడాదికి రెండేసి సినిమాలు చొప్పున రిలీజ్ చేయడం జరిగింది.
అవి ముందు ఏడాదిలో రిలీజ్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ లు డిలే అవ్వడంతో రిలీజ్ ఆలస్యమైంది. లేదంటే ఆ రికార్డు సాధ్యం కాదు. ఆ తర్వాత మళ్లీ ఆయన నుంచి మళ్లీ అలాంటి సన్నివేశం ఎదురు కాలేదు. అయితే 2025 లో మాత్రం రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. `హరిహర వీరమల్లు` జూన్ 12 నుంచి వాయిదా పడినప్పటికీ జులైలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
మేకర్స్ ఆ దిశగా పావులు కదుపుతున్నారు. జూన్ 15 తర్వాత రిలీజ్ ఎప్పుడైనా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే `ఓజీ` షూటింగ్ కూడా క్లైమాక్స్ కి చేరింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఇదే ఏడాది రిలీజ్ చేయనున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఉస్తాద్ భగత్ సింగ్` కూడా ఇదే ఏడాది రిలీజ్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ రెండు నెలల్లో పూర్తి చేయాలన్నది టార్గెట్. జూన్ రెండోవారం నుంచి చిత్రీకరణ పున ప్రారంభమ వుతుంది. అదే జరిగితే ఆగస్టు వరకూ షూటింగ్ పూర్తవుతుంది. అటుపై గ్యాప్ తీసుకున్నా? డిసెంబర్ రేసులో ఉస్తాద్ ఖాయమనే అంచనాలు కనిపిస్తున్నాయి.