భీమునిపట్నం వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను విమర్శించి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేరేందుకు రెడీ అయ్యారు. టీడీపీ ఓడిపోయాక వైసీపీ లోకి చేరి ఎమ్యెల్యేగా గెలిచి మంత్రిగా చేసిన అవంతి వైసీపీ ఓటమి పాలవ్వగానే వైసీపీ పార్టీకి రాజీనామా చేసేసి కూటమి ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పిలుస్తుందా అని వేచి చూస్తున్నారు.
ఎప్పుడో టీడీపీలో జాయిన్ అయ్యేవారే కానీ గంట శ్రీనివాస్ అవంతి ని టీడీపీ లో జాయిన్ అవ్వకుండా అడ్డుపడుతున్నారు అన్నారు, మరోపక్క అవంతి శ్రీనివాస్ టీడీపీ లోకి వెళ్లడం అవ్వకపోతే జనసేనలోకి అయినా వెళ్లేందుకు రెడీ అవుతున్నారట. ఇప్పటివరకు ఎదురు చూసిన అవంతికి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేరేందుకు పిలుపు వచ్చింది అంటూ వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
అవంతి శ్రీనివాస్ టీడీపీ లో చేరతారా, లేదంటే జనసేనలో చేరతారా, ఆయన కూటమి ప్రభుత్వంలోకి జాయిన్ అయ్యాక ఏమైనా పదవిని ఆశిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. కానీ అవంతి మాత్రం రేపో మాపో కూటమి ప్రభుత్వంలోకి వచ్చేస్తున్నారనేది కన్ ఫర్మ్.