Advertisementt

ఇండియన్ 2 vs థగ్ లైఫ్

Thu 05th Jun 2025 08:18 PM
thug life  ఇండియన్ 2 vs థగ్ లైఫ్
Indian 2 vs Thug Life ఇండియన్ 2 vs థగ్ లైఫ్
Advertisement
Ads by CJ

దర్శకుడు శంకర్ కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించిన భారతీయుడు 2 చిత్రం ఎంత పెద్ద డిజాస్టరో అందరికి తెలుసు. ఇండియన్ 2 పై విమర్శలు మాములుగా రాలేదు, శంకర్ లాంటి దర్శకుడు ఇలాంటి సినిమా చెయ్యడమేమిటి అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు. కమల్ కి అలాగే శంకర్ కి ఇద్దరిని ఇండియన్ 2 చిత్ర రిజల్ట్ చాలా ఎఫెక్ట్ చేసింది. 

తాజాగా కమల్ హాసన్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం థగ్ లైఫ్ చూసిన వారు ఇండియన్ 2 తో థగ్ లైఫ్ ని పోలుస్తున్నారు అంటేనే థగ్ లైఫ్ సినిమా ఎలా ఉందొ అర్ధమవుతుంది. మణిరత్నం-కమల్ హాసన్ కలయికలో వచ్చిన కల్ట్ క్లాసిక్ నాయకుడు తర్వాత వీరి కాంబోలో వచ్చిన థగ్ లైఫ్ పై అంచనాలు ఎంతగా ఉన్నాయో అందరూ చూసారు. ప్రమోషనల్ ఈవెంట్స్ తో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. 

కానీ థగ్ లైఫ్ విడుదలయ్యాక సినిమాకొచ్చిన టాక్ చూసాక చాలామంది మణిరత్నం నవాబ్ చిత్రానికి సీక్వెల్ గా చేసారా, అప్పుడు ఇండియన్ 2 ఇప్పుడు మణిరత్నం థగ్ లైఫ్ అంటూ మాట్లాడుతున్నారు.

కొందరు దర్శకులను మనస్పూర్తిగా విమర్శించాలన్నా మనసు రాదు. ఓ వర్గం ఆడియన్స్ దృష్టిలో మణిరత్నం అలాంటి దర్శకుడే.

ఒకప్పుడు ఆయన సినిమా వస్తే ఎలాగైనా చూడాలి అనిపించేది. కానీ ఇప్పుడు ఎందుకిలాంటి సినిమాలు చేస్తున్నారీయన అనిపిస్తుంది.

కొన్నేళ్ల తర్వాత ఎంత పెద్ద డైరెక్టర్‌కు అయినా మార్క్ మిస్ అవుతుంది. ప్రెజెంట్ మణి సార్ విషయంలో ఇదే జరుగుతుంది. ఒకే కథ మళ్లీ తిప్పి తిప్పి తీస్తున్నారీయన. థగ్ లైఫ్ చూస్తుంటే నవాబ్‌కు మరో వర్షన్ చూస్తున్నట్లు అనిపిస్తుంది.

ఓ నాయకుడు. అతడి సామ్రాజ్యం. చుట్టూ మంది మార్బలం. అదే గ్యాంగ్ స్టర్స్. అదే గొడవలు. అదే సొంత మనుషుల మధ్య యుద్ధం. నాయకుడు కాలం నుంచి ఇదే కథ చెప్తున్నారు మణిరత్నం. అప్పట్లో ఆయన స్క్రీన్ ప్లే నెక్ట్స్ లెవల్. నవాబ్ కూడా పర్లేదు. థగ్ లైఫ్ మాత్రం చూసి వదిలేయాలి అంతే. చాలా నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే మన సహనానికి పరీక్షే.

మణిరత్నం అనే బ్రాండ్ అని గుర్తు చేసుకోవాలి అంతే. సినిమా నిండా స్టార్స్ ఉన్నారు కానీ వాళ్ళకు సరైన క్యారెక్టర్స్ పడలేదు.

ఐకానిక్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన మణి. ఇప్పుడు స్క్రీన్‌ను తన బ్రాండ్‌తో నింపేసారంతే. సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి. అసలు అంత వీక్ సీన్స్ తీసింది మణిరత్నమేనా అనే డౌట్ వస్తుంది.ముఖ్యంగా త్రిష క్యారెక్టరైజేషన్. దాన్నెలా డిస్క్రైబ్ చేయాలో అర్థం కాదు.

ఓ గ్యాంగ్ స్టర్‌కు వెన్నుపోటు పొడిచి. అతడి స్థానాన్ని తీసుకుంటాడు ప్రాణంగా నమ్మినవాడు. వాళ్లిద్దరి మధ్య యుద్ధమే థగ్ లైఫ్. సింపుల్‌గా ఇదే కథ. కమల్ హాసన్ నటన గురించి మనం మాట్లాడాల్సిన పనిలేదు. శింబు బాగా చేసాడు. త్రిష క్యారెక్టర్ టిపికల్‌గా రాసుకున్నారు మణిరత్నం. ఓవరాల్‌గా థగ్ లైఫ్. మణిరత్నం మార్క్ మిస్సింగ్.. అంటూ థగ్ లైఫ్ చూసిన ఓ ప్రేక్షకుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న మాటలు అవి. 

Indian 2 vs Thug Life:

Thug Life Public talk

Tags:   THUG LIFE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ