స్వాగ్ చిత్రం డిజాస్టర్ తర్వాత హీరో శ్రీవిష్ణు నుంచి సింగిల్ చాలా సింపుల్ గా కోట్లు కొల్లగొట్టేసింది. మే 9 న సమంత నిర్మించిన శుభం చిత్రంతో పోటీ పడిన సింగిల్ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ను ఆకట్టుకోవడంతో థియేటర్స్ లో సింగిల్ సూపర్ హిట్ అయ్యింది, నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.
దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించిన సింగిల్ చిత్రంలో శ్రీవిష్ణు-వెన్నెల కిషోర్ ట్రాక్ కామెడీగా వర్కౌట్ అవడమే కాదు, ఆడియన్స్ కు ఆ కామెడీ కనెక్ట్ అయ్యింది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ రన్ తర్వాత ఇప్పుడు సింపుల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి ఎంట్రీ ఇచ్చేసింది.
సింగిల్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా.. ఈరోజు జూన్ 6 శుక్రవారం నుంచి సింగిల్ సడెన్ సర్ప్రైజ్ గా స్ట్రీమింగ్ కి వచ్చేయడమే కాకుండా తెలుగు సహా పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ లోకి రావడంతో అందరూ షాకవుతున్నారు. మరి థియేటర్స్ లో మిస్ అయిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ని హాయిగా ఓటీటీ లో వీక్షించేయ్యండి.