Advertisementt

టాలీవుడ్ కి కొత్త విలన్ దొరికాడు

Sun 01st Jun 2025 12:55 PM
tollywood  టాలీవుడ్ కి కొత్త విలన్ దొరికాడు
Tollywood has found a new villain టాలీవుడ్ కి కొత్త విలన్ దొరికాడు
Advertisement
Ads by CJ

టాలీవుడ్ కి లెజెండ్ చిత్రంతో బోయపాటి శ్రీను జగపతి బాబు ని విలన్ గా మార్చి అటు జగపతి బాబు కెరీర్ కు ఇటు టాలీవుడ్ కి కొత్త అధ్యయనానికి తెర తీశారు. హీరోగా పలు సినిమాలు చేసిన జగపతి బాబు లెజెండ్ తర్వాత స్టార్ హీరోలకు విలన్ గా చేసి సూపర్బ్ అనిపించారు. అప్పటినుంచి జగపతి బాబు కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. 

అలాగే అఖండ 2 లో శ్రీకాంత్ ని విలన్ ని చేసారు బోయపాటి. కానీ శ్రీకాంత్ అంతగా సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు టాలీవుడ్ కి మరో విలన్ దొరికాడు.. హీరోగా సినిమాలకు బిగ్ బ్రేకిచ్చి ఇప్పుడు వరస సినిమాలో సందడి చెయ్యడానికి రెడీ అయిన మంచు వారబ్బాయి మంచు మనోజ్ విలన్ అవతారమెత్తాడు. మొదటి సినిమా కమ్ బ్యాక్ అయ్యాక భైరవం లో హీరో కమ్ విలన్ గా గజపతి పాత్రలో చెలరేగిపోయాడు. 

భైరవం కి సర్వత్రా పాజిటివ్ రిపోర్ట్స్ రావడమేకాదు, మంచు మనోజ్ కేరెక్టర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక భైరవమే కాదు తేజ సజ్జ మిరాయ్ లోను మంచు మనోజ్ విలన్ కేరెక్టర్ చేస్తున్నాడు. భైరవం కన్నా ముందే మనోజ్ మిరాయ్ ఒప్పుకున్నాడు, కానీ భైరవం ముందు లైన్ లోకి వచ్చేసింది. 

మరి ఈలెక్కన మంచు మనోజ్ ని సరిగ్గా వాడితే, మంచి విలన్ కేరెక్టర్ ఇస్తే చెలరేగిపోడు..!

Tollywood has found a new villain:

New villain in Tollywood

Tags:   TOLLYWOOD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ