మెగాస్టార్ చిరంజీవి తో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న#Mega157 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో సాగుతుంది. మే 22 న రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళిన చిరు-అనిల్ రావిపూడి కాంబో ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్‌లో టాకీ పార్ట్‌ను మొదలుపెట్టారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.
ఆ షెడ్యూల్ లో మెగాస్టార్ చిరు పై అనిల్ రావిపూడి కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఈప్రాజెక్టు లోకి హీరోయిన్ గా నయనతారను తీసుకొచ్చిన అనిల్ రావిపూడి ఆమె ఎంట్రీ నే వైరల్ అయ్యేలా చేసాడు. ప్రస్తుతం నయనతార తన భర్త విగ్నేష్ శివన్ కొడుకు లతో కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది.
ఆమె వెకేషన్ నుంచి రాగానే చిరు-అనిల్ రావిపూడి మూవీ సెట్ కి వచ్చేస్తుంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు అనిల్ రావిపూడి. దానికి అనుగుణంగానే అన్ని పనులను చకచకా చేసుకుంటూ వెళ్తున్నాడు. రెండో షెడ్యూల్ ని కూడా త్వరలోనే మొదలు పెడతారు.. ఇది చూసే మెగా ఫ్యాన్స్ బాబోయ్ అనిల్-చిరు ఏమిటా స్పీడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.