Advertisementt

మోక్షు కి మోక్షం ఎప్పుడు బాలయ్య..

Sun 01st Jun 2025 03:39 PM
mokshagna  మోక్షు కి మోక్షం ఎప్పుడు బాలయ్య..
Mokshagna Movie update మోక్షు కి మోక్షం ఎప్పుడు బాలయ్య..
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ ఏ విషయంలో అయినా పర్ఫెక్ట్ గా ఉంటారేమో తెలియదు కానీ.. కొడుకు మోక్షజ్ఞ విషయంలో బాలయ్య ఎందుకో ఏమిటో ఓ పట్టాన అర్ధం కావడం లేదు. గత ఏడాది సెప్టెంబర్ లో మోక్షజ్ఞ బర్త్ డే రోజున ప్రశాంత్ వర్మ తో డెబ్యూ మూవీని ప్రకటించారు. కానీ ఆ సినిమా అనూహ్య పరిణామాలతో ఆగిపోయింది.

పోనీ మరో దర్శకుడితో మోక్షజ్ఞ డెబ్యూని ప్లాన్ చెయ్యకుండా బాలయ్య తన పని తను చూసుకుంటున్నారా, ఆ విషయంలోనే నందమూరి అభిమానులు తెగ ఆందోళన పడిపోతున్నారు. గత ఏడాది మోక్షజ్ఞ డెబ్యూ అనౌన్సమెంట్ తర్వాత నందమూరి అభిమానులు చాలా హ్యాపీగా.. వారసుడు ఎంట్రీ కోసం ఎదురు చూసారు.

కానీ మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి ముహూర్తమే కుదరడం లేదు, ఈలోపు బాలయ్య బర్త్ డే రానే వచ్చింది, అప్పుడైనా మోక్షజ్ఞ తెరంగేట్రం పై ప్రకటన వస్తుందా, లేదంటే అనే అనుమానం నందమూరి అభిమానుల్లో ఉంది. మరోపక్క మోక్షు కి మోక్షం ఎప్పుడు బాలయ్యా అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

Mokshagna Movie update:

Nandamuri Mokshagna

Tags:   MOKSHAGNA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ