డిప్యూటీ సీఎం గానే కాదు, పలు శాఖల మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే సెట్ పై ఉన్న సినిమాల షూటింగ్స్ ని కంప్లీట్ చేసెయ్యడమే కాదు, పవన్ కళ్యాణ్ భరోసాతో ఆయన సినిమాల నిర్మాతలు వరసగా రిలీజ్ లను పెట్టేస్తున్నారు. హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తవడమే తరువాయి మేకర్స్ జూన్ 12 విడుదల అని డేట్ లాక్ చేసేసి ప్రమోషన్స్ షురూ చేసేసారు.
మరోపక్క పవన్ కళ్యాణ్ OG సెట్ లోకి వెళ్లడంతో ఆ సినిమా నిర్మాత దానయ్య OG ని సెప్టెంబర్ 25 న రిలీజ్ చేస్తున్నట్టుగా ఈ ఆదివారం ఎలాంటి హడావిడి లేకుండా ప్రకటించారు. పవర్ బాధ్యతలతో పాటుగా ఇటు సినిమాలను కంప్లీట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ చూసి పాఠం నేర్చుకోవాల్సిందే అంటున్నారు.
పవన్ వచ్చేస్తున్నారు మరి మెగాస్టార్ చిరంజీవి ఏం చేస్తున్నారు.. ఇప్పుడు అదే మెగా ఫ్యాన్స్ లో మెదులుతున్న ప్రశ్న. ఎప్పుడో జనవరిలో విడుదల కావాల్సిన విశ్వంభర.. ఇప్పటికీ రిలీజ్ డేట్ కి నోచుకోవడం లేదు ఎంతగా విఎఫెక్స్ పనులు చేయిస్తున్నా ఇంత అలస్యమా అంటూ మెగా ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.
ఇటు చూస్తే సినిమా షూటింగ్ ముందు నుంచే అనిల్ రావిపూడి #MEGA157 కి తెగ హడావిడి చేసున్నాడు, మరోపక్క విశ్వంభర విషయం చాలామంది మర్చిపోయేలా ఉంది ప్రస్తుత పరిస్థితి. అదే మెగా అభిమానుల ఆందోళనకు అసలు కారణం. దర్శకుడు వసిష్ఠ ఎప్పుడు విశ్వంభర తేదీని ఫైనల్ చేస్తారో చూడాలి.