అఖండ 2 ని దసరా టార్గెట్ గా తెరకెక్కిస్తున్నట్టుగా బోయపాటి ఎప్పుడో అనౌన్స్ చేసారు. అఖండ 2 షూటింగ్ స్టార్ట్ అయినప్పటినుంచి పెద్దగా బ్రేక్స్ లేకుండానే షూటింగ్ సాఫీగా సాగుతుంది. బాలకృష్ణ అఖండ తాండవం షూటింగ్ కి గ్యాప్ ఇవ్వకుండా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.
అఖండ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న అఖండ తాండవం పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్ర టీజర్ ను జూన్ 10న బాలయ్య బర్త్ డే కి వదలాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య బర్త్ డే కి నందమూరి అభిమానుల కోసం నివ్వెర బిఫోర్-ఎవ్వర్ ఆఫ్టర్ ట్రీట్ ని సిద్ధం చేస్తున్నారట. అఖండ 2 షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో శరవేగంగా సాగుతోంది. ఈ షెడ్యూల్ లో బాలయ్య పై ఓ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది.
ఈ సీక్వెన్స్ లోనే బాలయ్య రెండో క్యారెక్టర్ కి సంబంధించి కూడా భారీ ట్విస్ట్ రివీల్ అవుతుందట. ఇక దసరా కి అఖండ 2 రావడానికి సమయం సరిపోదు అని, 2025 సంక్రాంతికి అఖండ 2 ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన మేకర్స్ చేస్తున్నారు, ఈసారి కూడా మెగాస్టార్ కి బాలయ్య కు నడుమ సంక్రాంతికి వార్ తప్పదని డిసైడ్ అవుతున్నారు.
కానీ తాజాగా అఖండ 2ని అఖండ సెంటిమెంట్ తో డిసెంబర్ లో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ప్లాన్ లో ఉన్నట్లుగా టాక్. సో డిసెంబర్ వరకు అఖండ 2 కోసం వెయిట్ చెయ్యాల్సిందే అనే మాట గట్టిగానే వినబడుతోంది. .