ఎంత టాప్ హీరోయిన్ గా మారినా.. పూజ హెగ్డే మాదిరి రష్మిక మందన్న కు టాలీవుడ్ స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కలేదు. అల్లు అర్జున్, మహేష్ లతో జోడిగా నటించిన రశ్మికకు కోలీవుడ్ హీరోలు వరస ఆఫర్స్ ఇస్తున్నారు. మరోపక్క హిందీలో వరస లైనప్స్ తో రష్మిక బిజీగా కాదు క్రేజీగా మారిపోయింది.
అలాంటి స్టార్ హీరోయిన్ కి ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కకపోయినా.. ఆమెకు ఎన్టీఆర్ తో కాలు కదిపే ఛాన్స్ అంటే స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసే అవకాశం వచ్చినట్టుగా టాక్ వినబడుతుంది. ఎన్టీఆర్-నీల్ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్(వర్కింగ్ టైటిల్) సినిమాకు సంబంధించి ఓ క్రేజీ టాక్ నడుస్తుంది.
ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. ఈ పాటలో ఎన్టీఆర్ తో కలిసి రష్మిక మందన్నా స్టెప్స్ వేయనున్నట్లు సమాచారం. ఆ ఐటమ్ సాంగ్ కోసం రష్మిక ను సంప్రదించగా.. రష్మిక కూడా ఈ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఈ పాట సినిమాకే హైలెట్ కానుందని.. సెకండ్ హాఫ్ లో వస్తుందని సమాచారం.