సూర్య లేటెస్ట్ చిత్రం రెట్రో. సూర్య-పూజ హెగ్డే జంటగా కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కించిన రెట్రో చిత్రం మే 1 న థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసింది. సూర్య అభిమానులను కంగువ, రెట్రో రెండు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ నిరాశపరిచాయి. రెట్రో పై ఆశలు పెట్టుకుంటే అది తెలుగులో డిజప్పాయింట్ చేసినా తమిళ్ లో ఓకె ఓకె అనిపించే రిజల్ట్ ఇచ్చింది.
ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని కన్ ఫర్మ్ చేసుకుంది. రెట్రో ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకుంది. మే 1 న థియేటర్స్ లో విడుదలైన రెట్రో చిత్రం ఈ నెల 31 నుంచి అంటే మే 31 శనివారం నుంచి స్ట్రీమింగ్ లోకి తీసుకురాబోతున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది.
తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రెట్రో స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ అనౌన్సమెంట్ ఇచ్చింది. రెట్రో లో సూర్య- పూజ హెగ్డే రొమాన్స్ ను థియేటర్స్ లో మిస్ అయిన వారు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో మే 31 నుంచి వీక్షించేందుకు రెడీ అవ్వండి.