తెలుగు- హిందీ చిత్రసీమలకు సుపరిచితులైన ఇద్దరు అందాల భామలు దిశా పటానీ, కియరా అద్వాణీ. ఈ ఇద్దరి మధ్యా బికినీ వార్ పీక్స్ కి చేరుకుంటోంది. కియరా `వార్ 2` బికినీ లుక్ బయటకు రాగానే, ఇంటర్నెట్ లో నెటిజనులు బికినీ వార్ కి తెర లేపారు. ఇండస్ట్రీలో బెస్ట్ బికినీ బాడీ ఎవరికి ఉందో తెలుసుకునేందుకు యూత్ ఉవ్విళ్లూరుతున్నారు.
అలా గూగుల్ లో సెర్చ్ చేస్తే, దిశా పటానీ బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోలు కొన్ని ఇంటర్నెట్ లోకి తిరిగి వచ్చాయి. దిశా బికినీ ఎంపికలో ది బెస్ట్ అంటూ ఫ్యాన్స్ ఈ ఫోటోలకు కితాబిస్తున్నారు. ఇప్పుడు దిశా పాత ఫోటోలనే కొత్తగా వైరల్ చేస్తున్నారు. పనిలో పనిగా వార్ 2 టీజర్ నుంచి కియరా అద్వాణీ బికినీ ఫోటోలను దిశా బికినీలతో జోడించి వైరల్ చేస్తుండడం హాట్ టాపిగ్గా మారింది. ఆ ఇద్దరిలో ఎవరిది బెస్ట్ బికినీ బాడీ? సెలెక్ట్ యువర్ వోన్ ఛాయిస్..
దిశా పటానీ ఇటీవలే ప్రభాస్ సరసన కల్కి 2898 ఏడి చిత్రంలో నటించింది. తదుపరి పలు భారీ చిత్రాల్లో నటించేందుకు సంతకాలు చేసింది. మరోవైపు కియరా అద్వాణీ వరుస చిత్రాల్లో నటిస్తోంది. కొంత గ్యాప్ తర్వాత వార్ 2 చిత్రంతో బరిలోకి దూసుకొస్తోంది. పెళ్లయాక, త్వరలోనే మమ్మీ కాబోతున్న కియరాకు ఈ ప్రాజెక్ట్ ఎంతో ప్రత్యేకమైనది.