కన్నడ భామ రుక్మిణి వసంత్ కి ఎందుకింత డిమాండ్, స్టార్ హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోలవరకు అందరూ రుక్మిణి వసంత్ జపమే చేస్తున్నారు. కన్నడ లో హిట్ హీరోయిన్ అయినా.. తెలుగులోకి సప్తసాగరాలతో ఓకె అనిపించినా, నిఖిల్ తో చేసిన సినిమా డిజాస్టర్. తాజాగా రుక్మిణి వసంత్ నటించిన విజయ్ సేతుపతి ఎస్ చిత్రం తెలుగులో నిరాశపరిచింది.
అయినప్పటికీ టాలీవుడ్ హీరోలు రుక్మిణి వసంత్ తో రొమాన్స్ చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ప్రశాంత్ నీల్ డ్రాగన్(వర్కింగ్ టైటిల్) లో ఛాన్స్ కొట్టేసింది అనే టాక్ ఉంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ రుక్మిణి వసంత్ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.
అలాగే కోలీవుడ్ లో శివకార్తికేయన్ తోనూ ఓ సినిమా చేస్తుంది. మరోపక్క నవీన్ పోలిశెట్టి, మణిరత్నం కాంబోలో తెరకెక్కనున్న సినిమాలోనూ రుక్మిణి ఛాన్స్ అందుకుందని టాక్. ఇక మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్ కన్ను రుక్మిణి వసంత్ పై పడింది అంటున్నారు. వెంకీ హీరోగా చెయ్యబోయే మూవీలో రుక్మిణి ని తీసుకోవాలని త్రివిక్రమ్ చూస్తున్నారట.
కన్నడలో క్రేజీ భామగా మారిన రుక్మిణి వసంత్ నామ జపంతో టాలీవుడ్ యంగ్ హీరోలు తడిసి ముద్దవడం చూసిన సినీప్రియులు ఎవరీ రుక్మిణి వసంత్-ఎందుకింత డిమాండ్ అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.