పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు, రెండుసార్లు ఓడిపోయాడు, ఇక అసెంబ్లీలో పవన్ కాలు పెట్టలేడు, చంద్రబాబు కి పవన్ దత్తపుత్రుడు, పవన్ కళ్యాణ్ హీరో కాదు జీరో, అటు సినిమాల్లో కానీ, ఇటు రాజకీయాలకు కానీ పవన్ పనికిరాడు అంటూ వైసీపీ నేతలు, వైసీపీ అధ్యక్షుడు జగన్ మాట్లాడి మాట్లాడి పవన్ కళ్యాణ్ ని రాజకీయాల్లో హీరోని చెయ్యడమే కాదు, పవన్ అసెంబ్లీ లో కాలు పెట్టగానే పవన్ ని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడిన వైసీపీ వాళ్ళంతా అసెంబ్లీ గేటు టచ్ చేసే అర్హత కోల్పోయారు.
ఇప్పుడు డిప్యూటీ హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ని విమర్శించేందుకు పేర్ని నాని పదే పదే ప్రత్యక్షమవుతాడు. రీసెంట్ గా థియేటర్స్ బంద్ విషయంలో పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుపై పేర్ని నాని ఫైర్ అయ్యాడు. హరి హర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ తన మాటను పక్కనపెట్టాడు, అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా ఉంది పవన్ తీరు..
హరిహర వీరమల్లు ప్లాప్ సినిమా, ప్లాప్ సినిమా కోసం పవన్ ఆరాటం అంటూ పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ ని, ఆయన సినిమా హరి హర వీరమల్లు ని తక్కువ చేస్తూ మట్లాడడం చూసిన వారు పవన్ ని గతంలో అలా మాట్లాడే ఇప్పుడు హీరో ని చేసారు, ఈసారి పవన్ తో పెట్టుకున్నారు.. హరి హర వీరమల్లుతో బ్లాక్ బస్టర్ కొట్టడం గ్యారెంటీ అంటూ పవన్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.