కొడాలి నాని అమెరికా పారిపోతున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనపై ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చెయ్యడమే కాదు, దేశంలోని అన్ని ఎయిర్ పోర్ట్ లను అలెర్ట్ చేసిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో హైదరాబాద్ AIG ఆసుపత్రి నుంచి ముంబై లోని ప్రవేట్ ఆసుపత్రికి వెళ్లి గుండెకు సంబందించిన శస్త్ర చికిత్స చేయించుకున్న నాని.. అమెరికా వెళ్ళబోతున్నాడనే వార్త వైరల్ అయ్యింది.
కొన్ని కేసుల్లో కొడాలి నాని కి ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని అనుకుంటున్న సమయంలోనే ఆయన అనారోగ్యం బారిన పడడం, ఇప్పుడు అమెరికా వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటాడనే వార్తల నేపథ్యంలో అతనిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసారు. కొడాలి నాని అరెస్ట్ అవుతాడని అంటోన్న సమయంలో కొడాలి నాని ఓ పెళ్ళికి హాజరయ్యారు.
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. కొడాలి నాని అరెస్ట్ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పెళ్లికి వెళ్లిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.