రణబీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లాడిన ఆలియా భట్ లైఫ్ బెస్ట్ ఫేజ్ లో ఉంది. ముంబైలో దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్ తో రాజీ అన్నదే లేకుండా అత్యంత విలాసవంతమైన స్వగృహాన్ని ఈ జంట నిర్మించింది. త్వరలోనే అధికారికంగా ఈ గృహంలోకి ప్రవేశించబోతున్నారు. అంతేకాదు ఈ భవంతి నిర్మాణంలో ఉండగానే తమ గారాల పట్టీ, 3 ఏళ్ల కిడ్ రాహా కపూర్ కి దీనిని కానుకగా రాసిచ్చారు.
ఇటీవల రణబీర్ యానిమల్, తూ జీతూ మర్కర్ లాంటి బ్లాక్ బస్టర్లతో కెరీర్ బెస్ట్ ఫేజ్ లో ఉన్నాడు. అతడు ప్రస్తుతం నితీష్ తివారీ `రామాయణం`లోను నటిస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ఫ్రాంఛైజీ చిత్రం హిందీ బెల్ట్ తో పాటు దక్షిణాదినా అత్యంత భారీగా విడుదల కానుంది. మరోవైపు ఆలియా తన కెరీర్ బెస్ట్ సినిమాల్లో నటిస్తోంది. యష్ రాజ్ ఫిలింస్ `ఆల్ఫా`తో పాటు, భన్సాలీ `లవ్ అండ్ వార్` చిత్రంతోను బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఆలియా మరో గుడ్ న్యూస్ చెప్పబోతోందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
సోషల్ మీడియా కథనాల ప్రకారం.. కేన్స్ లో ఆలియా భట్ అసలు రహస్యం బయటపడింది. ఇప్పుడు ఆలియా తన రెండో బిడ్డను గర్భంలో మోస్తోందనేది రెడ్డిటర్ల వాదన. ఆలియా ఇప్పటికే రకరకాల డిజైనర్ దుస్తుల్లో కేన్స్ రెడ్ కార్పెట్ పై సందడి చేసింది. అయితే ఆలియాను నిశితంగా గమనించిన నెటిజనులు రెండోసారి మమ్మీ కాబోతోంది అంటూ కనిపెట్టేసారు. ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్ లో దావానలంలా మారింది. అయితే ఆలియా -రణబీర్ దంపతులు దీనిని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది.