మంచు మనోజ్ పర్సనల్ వ్యవహారాలను పక్కనపెట్టి ఆయన నటించిన భైరవం చిత్రం పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం భైరవం చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ మనోజ్ ఇంటర్వూస్ ఇస్తున్నారు. అయితే తన వ్యక్తిగత విషయాల్లో సినిమాలను ముడిపెట్టకూడదు అని, తను కన్నప్ప చిత్రం పై చేసిన వ్యాఖ్యల విషయంలో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని చెప్పాడు.
అంతేకాదు తన అన్న విష్ణు తోనే తన గొడవని, తన తండ్రి మోహన్ బాబు తో ఎలాంటి గొడవ లేదు, కానీ అన్నదమ్ముల గొడవ ఇప్పుడు తండ్రీకొడుకుల గొడవగా మారిపోయింది అని చెప్పిన మంచు మనోజ్ తనేదున్నా మొహం మీదే మాట్లాడతాను, అందుకే అందరికి నేను పగయ్యాను అన్నాడు. తన మొదటిభార్యతో విడాకులయ్యాక రెండేళ్లు నేను మనిషిని కాలేకపోయాను, నన్ను అందులోనుంచి బయటికి తీసుకురావడానికి మా అమ్మ చాలా కష్టపడింది, ఆతర్వాత మౌనిక నా లైఫ్ లోకి వచ్చాక అంతా మారిపోయింది అని మనోజ్ చెప్పుకొచ్చాడు.
ఇక సినిమాల విషయానికొస్తే తాను ఇకపై సినిమాలపై ఫోకస్ పెడతాను అని, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ అందరూ పాన్ ఇండియా స్టార్స్ అయ్యి మాకు గేట్లు ఓపెన్ చేసారు, వారే మా బ్రదర్స్ అంటూ మనోజ్ పాన్ ఇండియా మూవీ గురించి మాట్లాడాడు. అంతేకాదు చరణ్, ఎన్టీఆర్ చిత్రాల్లో విలన్ రోల్స్ వస్తే ఖచ్చితంగా అంటూ మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.