పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంత మొహమాటస్తుడో అనేది అందరికి తెలుసు. ఒక పార్టీకి వెళ్లడం కానీ, లేదంటే ఫంక్షన్స్ లో హడావిడి చెయ్యడం కానీ చాలా అరుదుగా జరుగుతుంది ప్రభాస్ విషయంలో. ఆయన ఎక్కువగా ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్లడం, పార్టీ లు చేసుకోవడం తప్ప ఇంకేం ఉండవు ప్రభాస్ లైఫ్ లో. అసలు ఫ్రెండ్స్, పార్టీలు కూడా చాలా సైలెంట్ గా సీక్రెట్ గా జరుగుతాయి.
ఇక మూవీ ఈవెంట్స్ లోను, అలాగే సెట్ లోను ప్రభాస్ కాస్త రిజర్వడ్ గా కనిపిస్తారనే టాక్ ఉంది. కానీ ఆయన తో రాజా సాబ్ లో వర్క్ చేస్తున్న హీరోయిన్ మాళవిక మోహనన్ మాత్రం ప్రభాస్ తో కలిసి మాట్లాడుతుంటే అసలు బోర్ కొట్టదు అంటుంది. ప్రభాస్ సినిమా ఫంక్షన్స్ లో చూసినప్పుడు చాలా సైలెంట్ గా ఉండేవారు.
ఆయన అలానే ఎప్పుడు సైలెంట్ గా ఉంటారేమో అనుకున్నాను, కానీ సెట్ లో ప్రభాస్ సరదాగా మాట్లాడుతూ ఉంటే టైమ్ తెలియదు, బోర్ కొట్టదు.. అంటూ చెప్పిన మాళవిక వచ్చే నెలలో రాజా సాబ్ టీజర్ రాబోతున్నట్టుగా ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించింది.