Advertisementt

పారితోషికంలో టాప్- 10 సౌత్ స్టార్లు

Fri 23rd May 2025 06:10 PM
top 10 highest paid actors  పారితోషికంలో టాప్- 10 సౌత్ స్టార్లు
Top 10 highest paid south actors పారితోషికంలో టాప్- 10 సౌత్ స్టార్లు
Advertisement
Ads by CJ

సౌతిండియాలో టాప్ -10 రెమ్యున‌రేష‌న్స్ జాబితా ప‌రిశీలిస్తే.. ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న స్టార్- ర‌జ‌నీకాంత్. సూప‌ర్ స్టార్ ఒక్కో సినిమాకి 300కోట్లు అందుకుంటున్నారు. ప్ర‌స్తుతం లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో కూలీ చిత్రంలో న‌టిస్తున్న ర‌జ‌నీ కోసం త‌దుప‌రి భారీ లైన‌ప్ సిద్ధంగా ఉంది. త‌లైవా ర‌జ‌నీకాంత్ త‌ర్వాత భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న ద‌ళ‌ప‌తి విజ‌య్ రూ. 270 కోట్ల పారితోషికంతో సౌత్ లో రెండో స్థానంలో ఉన్నార‌ని స‌మాచారం.

అయితే టాలీవుడ్ స్టార్ హీరోల్లో పుష్ప స్టార్ అల్లు అర్జున్ నంబ‌ర్ వ‌న్ స్తానానికి ఎగ‌బాకాడు. అత‌డు అట్లీతో సినిమా కోసం ఏకంగా 200 కోట్లు అందుకుంటున్నాడు. మ‌హేష్‌, ప్ర‌భాస్ దాదాపు 180కోట్ల పారితోషికం అందుకుంటూ ఆ త‌ర్వాతి స్థానాలు ద‌క్కించుకున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్- దేవ‌ర లాంటి పాన్ ఇండియ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో రేసులోకి దూసుకొచ్చిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఒక్కో చిత్రానికి 150కోట్ల మేర డిమాండ్ చేస్తున్నాడు. 

అత‌డు న‌టిస్తున్న వార్ 2 మ‌రో మెట్టు ఎక్కించ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చా సాగుతోంది. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్ ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత గేమ్ ఛేంజ‌ర్ తో ఫ్లాప్ ని ఎదుర్కోవ‌డం మైన‌స్ అయింది. అయినా అత‌డు 130 కోట్ల రేంజులో పారితోషికం అందుకుంటున్నాడు. ఉప్పెన ఫేం బుచ్చిబాబు తెర‌కెక్కిస్తున్న `పెద్ది` కోసం అత‌డు ఇంత పెద్ద మొత్తాన్ని అందుకుంటున్నాడు. సీనియ‌ర్ల‌లో మెగాస్టార్ చిరంజీవి, విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ లాంటి స్టార్లు 100 కోట్లు అందుకుంటూ రేస్ లో ఉండ‌డం నిజంగా అంద‌రికీ స్ఫూర్తి. 

Top 10 highest paid south actors:

Highest paid actor in south

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ