Advertisementt

ఆ రూమర్స్ నమ్మకండి - కాంతార టీమ్

Fri 23rd May 2025 12:32 PM
kantara 1  ఆ రూమర్స్ నమ్మకండి - కాంతార టీమ్
Kantara Chapter 1 Makers Clears Air ఆ రూమర్స్ నమ్మకండి - కాంతార టీమ్
Advertisement
Ads by CJ

కాంతార చిత్రం కన్నడ లోనే కాదు పాన్ ఇండియా మార్కెట్లోను సన్సెషనల్ హిట్ అయ్యింది. దర్శకుడిగా, హీరోగా రిషబ్ శెట్టి కాంతార చిత్రాన్ని అన్ని భాషల వారికి దగ్గర చేసారు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. దానికి ప్రీక్వెల్ గా రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. 

అయితే కాంతార 1 స్టార్ట్ అయినప్పటినుంచి కాంతార టీమ్ ని ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంది. కాంతార 1 జూనియర్ ఆర్టిస్ట్ లు వెళుతున్న బస్సు తిరగబడి పలువురికి గాయాలవ్వగా, రీసెంట్ గా కాంతార 1 టీం లోని సభ్యుడు నీళ్ళల్లో మునిగి చనిపోయాడు. ఇప్పుడు తాజాగా కాంతార 1 చిత్రం అక్టోబర్ నుంచి పోస్ట్ పోన్ అవ్వబోతుంది అనే రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. 

కాంతార చాప్టర్ 1 వాయిదా పడబోతుంది అనే రూమర్స్ కి టీమ్ చెక్ పెట్టింది. తాము అనుకున్న ప్రకారమే కాంతార 1 షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నాము, ప్లానింగ్ ప్రకారమే చిత్రీకరణ జరుగుతుంది. మమ్మల్ని నమ్మండి, వేచి చూసే సమయం ఎంత  విలువైనదో మీకే అర్ధమవుతుంది. ఈ సినిమాపై వస్తోన్న ఏ రూమర్ ని నమ్మకండి, అక్టోబర్ 2 న ఖచ్చితంగా కాంతార 1 వస్తుంది అంటూ సోషల్ మీడియా వేదికగా కాంతార 1 విడుదల వాయిదాపై వస్తున్న వార్తలపై టీమ్ రియాక్ట్ అయ్యింది. 

Kantara Chapter 1 Makers Clears Air:

Kantara Chapter 1 Release Date Confirmed

Tags:   KANTARA 1
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ