పాన్ ఇండియా స్టార్స్ గా ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు తమ క్రేజ్ ని, నార్త్ లో తమ మార్కెట్ ని పెంచుకున్నారు. బాహుబలి తో ముందుగా పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ చేసిన ప్రభాస్ దానిని కంటిన్యూ చేస్తున్నారు. ఆతర్వాత అల్లు అర్జున్ పుష్ప తో నార్త్ లో అడుగుపెట్టి కలెక్షన్స్ సునామి సృష్టిస్తే.. రామ్ చరణ్-ఎన్టీఆర్ లు ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టారు.
అయితే వీరిలో ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పై కన్నేస్తున్నారు. ఇప్పటికే కల్కి 2898 AD చిత్రం తో ప్రభాస్ తో జోడి కట్టిన దీపికా పదుకొనె ఆ చిత్రంతో సౌత్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత దీపికా పదుకొనె కు ప్రభాస్ మరో పాన్ ఇండియాఫిల్మ్ స్పిరిట్ లో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది, సందీప్ వంగా కు దీపికా వర్కింగ్ టైల్ నచ్చక ఆమెను స్పిరిట్ ప్రాజెక్ట్ నుంచి తప్పించారనే టాక్ వినిపిస్తోంది.
అయితే ఇప్పుడు మరో పాన్ ఇండియా స్టార్ దీపికా పదుకొనే పై కన్నేశారనే న్యూస్ వైరల్ అయ్యింది. అది కేవలం బజ్ మాత్రమే అయినా.. వినడానికి వినసొంపుగా ఉండడంతో ఆ హీరో ఫ్యాన్స్ ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఆయనెవరో కాదు పుష్ప తో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.
అల్లు అర్జున్-అట్లీ కలయికలో మొదలు కాబోయే ప్రాజెక్టులో హీరోయిన్ గా దీపికా పదుకొనె పేరు వినబడుతుంది. అట్లీ గత చిత్రం జవాన్ లోను దీపికా నటించింది. అందుకే అది రూమర్ అయినా.. దీపికా-అల్లు అర్జున్ కలిసి కనిపించే అవకాశం లేకపోలేదు అంటున్నారు.