టీడీపీ పెట్టిన రాజకీయ బిక్షతో ఎదిగి ఆ తర్వాత టీడీపీ నుంచి వైసీపీ కి కండువా మార్చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు అధికార మదంతో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడి చివరికి జైలు కి వెళ్లే పరిస్థితి తెచ్చుకున్నారు. ప్రతిపక్షాన్ని విమర్శించడం వేరు, చిల్లర మాటలతో అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో వల్లభనేని వంశీ అనుభవిసున్నాడు.
ఇక మిగిలింది కొడాలి నాని నే. గుడివాడ గుట్కా ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతాడా అని ఎదురు చూడని టీడీపీ అభిమాని, టీడీపీ కార్యకర్త లేరు అంటే నమ్మాలి. కేవలం అనుచిత వ్యాఖ్యలే కాదు కొడాలి నాని గత ప్రభుత్వ కాలంలో పాల్పడిన అక్రమాలకు సంబంధించి, విజిలెన్సు విచారణలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఆయనపై విచారణలు ఒక కొలిక్కి రానున్నాయని, త్వరలోనే కేసులు నమోదు అవుతాయని అంతా అనుకుంటున్న సమయంలో కొడాలి నాని అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు.
హైదరాబాద్, ముంబై ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న కొడాలి నాని ఇప్పుడు అమెరికా వెళ్లి కేసుల నుంచి తప్పించుకునే ప్లాన్ చేస్తున్నాడనే టాక్ సోషల్ మీడియాలో మొదలైంది. అనారోగ్య కారణాలని చెబుతున్నా ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్నంతవరకు కొడాలి నాని అరెస్ట్ కాకుండా ఉండేందుకే ఇలా అమెరికా పయనమవుతున్నాడనే అనుమానాలతో ఏపీ పోలీసులు కొడాలి నాని పై లుకౌట్ నోటీసులు జారీ చేసారు.
ఇండియాలోని పలు ఎయిర్ పోర్ట్ లో కొడాలి నాని పై లుకౌట్ నోటీసులు జారీ చేసి అతను ఎక్కడికి పారిపోకుండా చూసేందుకు పోలీసులు వేట మొదలుపెట్టారు. ఇప్పటికే కాకాణి లాంటి వాళ్ళు అరెస్ట్ లు తప్పించుకుని తిరుగుతున్నారు, ఇప్పుడు కొడాలి తప్పించుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.