టాప్ హీరోయిన్ అయ్యుండి హీరో నాగ చైతన్య ను ప్రేమించి సినిమా ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టి అటు దగ్గుబాటి ఇటు అక్కినేని రెండు కుటుంబాలకు బాగా దగ్గరైన సమంత, మామగారైన నాగార్జున కు కూడా బెస్ట్ కోడలిగా మారింది. నాగ చైతన్య-సమంత కలిసి కనిపిస్తే అభిమానులకు పండగే. అలాంటి జంటకు ఏ దిష్టి తగిలిందో చైతు-సమంత విడాకులు తీసుకుని విడిపోవడం అభిమానులనే కాదు నాగార్జునను బాధించింది.
సమంత తో నాగార్జున ఫ్యామిలిలో అమల, అఖిల్ అందరూ ఏంతో ప్రేమగా కనిపించారు. కానీ విడిపోయాక అందరూ చైతు పక్షానే నిలబడ్డారు, చైతు కోరుకున్న రెండో పెళ్లి చేశారు. అయితే చైతు-సమంత విడిపోయాక అమల-సమంత మొదటిసారి ఓ ఈవెంట్ లో కనిపించడం హైలెట్ అయ్యింది. జీ తెలుగు ఛానల్ లో జరిగిన ఓ వేడుకలో సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో 15 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా అవార్డు తో సత్కరించారు.
ఆ అవార్డు వేడుకకు అమల గెస్ట్ గా హాజరయ్యారు. మాజీ కోడలికి అవార్డు రావడంతో అమల క్లాప్స్ కొట్టారు. అంతేకాదు అమల స్టేజ్ పై అక్కినేని హీరోల గురించి మాట్లాడుతుంటే సమంత నవ్వుతూ కనిపించిన ప్రోమోస్ ని జీ తెలుగు వదులుతుంది. ఈ ప్రోగ్రాం త్వరలోనే జీ తెలుగు నుంచి ప్రసారం కానుంది.