పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-మారుతి కలయికలో ఎప్పుడో మొదలైన రాజా సాబ్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో రాజా సాబ్ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. ద రాజా సాబ్ కొత్త రిలీజ్ డేట్ చెప్పమంటూ అభిమానుల ప్రెజర్ ఎక్కువైంది. మరోపక్క మే మిడిల్ లో రాజా సాబ్ టీజర్ అన్నారు.
ఇంతవరకు రాజా సాబ్ టీజర్ పై ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తూ డిజప్పాయింట్ మోడ్ లోకి వెళుతున్నారు. మారుతి రాజా సాబ్ టీజర్ కానీ, రిలీజ్ డేట్ కానీ ఇవ్వకుండా ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెడుతున్నారు. అయితే రాజా సాబ్ టీజర్ పై ఇప్పుడొక కొత్త న్యూస్ వినిపిస్తోంది.
అసలు రాజా సాబ్ టీజర్ వదలాలి అంటే దానికి రిలేటెడ్ గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చెయ్యాలని, ఒకవేళ డేట్ ఇవ్వకపోయినా మంత్ అయినా వెయ్యాలి కాబట్టే టీజర్ ని లేట్ చేస్తున్నారంటున్నారు. రాజా సాబ్ రిలీజ్ డేట్ విషయంలో ఇంకా చర్చలు ఓ కొలిక్కి రాలేదని, అందుకే టీజర్ విషయం తేలడం లేదు అని టాక్.