అందంతో కట్టి పడేయడం.. ఫ్యాషన్ సెన్స్ తో మైమరిపించడం ఈ రెండు లక్షణాలు నేటితరం కథానాయికలకు అవసరం. అయితే అవన్నీ ఉన్నా నటప్రతిభ లేకుండా ఎదగడం సాధ్యపడదు. ఆరంభం అవకాశాలు అందుకున్నంత సులువు కాదు ఇండస్ట్రీలో మనుగడ సాగించడం. కానీ పై లక్షణాలన్నిటినీ అందిపుచ్చుకుని జాన్వీ కపూర్ కథానాయికగా వేగంగా ఎదిగేస్తోంది. నేడు దేశంలోని పాన్ ఇండియన్ స్టార్లతో వరుస చిత్రాల్లో నటిస్తూ సహనటీమణుల కంటే వేగంగా ఉన్నానని నిరూపిస్తోంది.
ఆర్.ఆర్.ఆర్ స్టార్లు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తన ఎర్లీ కెరీర్ లోనే నటించేస్తుండడం నిజంగా ఆశ్చర్యకరం. అయితే జాన్వీ కేవలం అందం ఫ్యాషన్ సెన్స్ తోనే కాదు.. ప్రతిభతోను ఈ అవకాశాల్ని అందుకుంది. ప్రస్తుతం కేన్స్ 2025 ఉత్సవాల్లో సందడి చేస్తున్న జాన్వీకపూర్ అక్కడ తనదైన ఫ్యాషన్ సెన్స్ తో ఉర్రూతలూగించింది.
తరుణ్ తహిలానియా రూపొందించిన స్పెషల్ డిజైనర్ లెహంగాలో జాన్వీ ఎంతో అందంగా మెరిసిపోయింది. కేన్స్ 2025 ఉత్సవాల్లో కళ్లన్నీ జాన్వీపైనే! ప్రస్తుతం జాన్వీ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. జాన్వీ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తోంది. బుచ్చిబాబు ఈ చిత్రానినికి దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ నటన ఎలా ఉంటుందో వేచి చూడాలి.