మే 20 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే. పాన్ ఇండియా స్టార్ బర్త్ డే అంటే అభిమానుల కేక్ కటింగ్స్, ఆయన నటించే సినిమాల నుంచి స్పెషల్ ట్రీట్స్, ఈమద్యలో సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖుల బర్త్ డే విషెస్ తో హడావిడి కనిపిస్తుంది. అందులోను ఆర్.ఆర్.ఆర్, దేవర తర్వాత మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ని చేతిలో పెట్టుకున్న ఎన్టీఆర్ బర్త్ డే అంటే అభిమానులకు ప్రత్యేకమే.
ఇక సోషల్ మీడియాలో యంగ్ టైగర్ కి మరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ Happy Birthday Bava @tarak9999! Wishing you all the success , Joy & Happiness 🖤 అంటూ ఇంట్రస్టింగ్ గా విషెస్ తెలియజెయ్యగా, ఎన్టీఆర్ అంతే ప్రేమతో థాంక్యూ బావా అంటూ రిప్లై ఇవ్వడం అభిమానులను సంతోషపరిచింది.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన మరో ట్వీట్ అందరిని ఆకర్షించింది. అదే మినిస్టర్ నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ కి Happy Birthday @tarak9999! Wishing you a year full of happiness and success.. అంటూ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పగా.. దానికి ఎన్టీఆర్ రియాక్ట్ అవుతూ.. Thank you for your warm wishes Lokesh.. అంటూ రిప్లై ఇవ్వడం మాత్రం టీడీపీ అభిమానులను బాగా సర్ ప్రైజ్ చేసింది.