కోలీవుడ్ లో జయం రవి-ఆర్తి ల విడాకుల కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. జయం రవి-తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్టుగా, వైవాహిక జీవితంలో ప్రశాంతత కోల్పోయి భార్య నుంచి విడిపోతున్నట్టుగా ప్రకటించిన తర్వాత ఆర్తి తనకు విడాకులు ఇష్టం లేదని చెప్పింది. తనని సంప్రదించకుండానే ఈ విడాకులు విషయం ప్రకటించడం పై ఆర్తి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యింది.
ప్రస్తుతం జయం రవి - ఆర్తీ ల విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో నడుస్తుండగా.. జయం రవి తన కొత్త గర్ల్ ఫ్రెండ్ సింగర్ కేనీషా కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడం పై ఆర్తి ఇండైరెక్ట్ గా స్పందించింది. అటు ఆర్తి తల్లి జయం రవి వల్ల 100 కోట్లు నష్టపోయానంటూ ఆరోపించడం హాట్ టాపిక్ అయ్యింది. జయం రవి తను వివాహ బంధంలో నరకం అనుభవించాను, ఇతరుల సానుభూతి కోసం పిల్లలను అడ్డుపెట్టుకోవడం కరెక్ట్ కాదు, కేనీషా తోడు నాకు సపోర్ట్ గా ఉంది, ఆమెను ఏమైనా అంటే ఊరుకోను అంటాడు.
తాజాగా ఆర్తి స్పందిస్తూ.. తనపై జయం రవి చేసిన ఆరోపణలన్నీ అబద్దాలు, పిల్లల కోసం సానుభూతి సంపాదించుకోవడమంటే ఏ తల్లి అలా చెయ్యదు, రవి కోసం తన కలలు త్యాగం చేశాను అంటుంది. అతడి కెరీర్ కోసం 15 ఏళ్లుగా నా కలలు, మాస్టర్స్ డిగ్రీ త్యాగం చేశాను, ఒకవేళ నా లైఫ్ నేను చూసుకుని అతన్ని పట్టించుకోకపోయుంటే ఇంకా బెటర్ గా జీవించేదాన్ని.
ఆర్థికపరమైన లావాదేవీలు కలిసే చూసుకున్నాం, అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అన్ని కోర్టుకు సమర్పిస్తాను, సోషల్ మీడియాలో నాకు సపోర్ట్ చేస్తున్నవారికి కృతఙ్ఞతలు తెలుపుతున్నాను, నాకు న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నాను అంటూ ఆర్తి రవి పోస్ట్ పెట్టింది.