సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష కృష్ణన్ మరింత బ్రైట్ అందాలతో కనిపించడమే కాదు, అంతకు మించిన బిజీగా టాప్ హీరోయిన్ గా మారిపోయింది. కెరీర్ కి గ్యాప్ వస్తుంది అనుకున్న తరుణంలో పొన్నియన్ సెల్వన్ త్రిష కెరీర్ ని మలుపు తిప్పింది. ఆ చిత్ర రిజల్ట్ తో పని లేకుండా త్రిషకు స్టార్స్ హీరోల సినిమాలు క్యూ కట్టాయి.
విజయ్, అజిత్, చిరంజీవి, కమల్ హాసన్ ఇలా త్రిష వరస అవకాశాలు చేజిక్కించుకుంది. అవకాశాలు సరే సరి. త్రిషలో అందం మరింత పెరిగిందా అనేలా ఆమె లుక్స్ ఉంటున్నాయి. శారీ కానివ్వండి, మోడ్రెన్ డ్రెస్ ఇలా దేనిలోనైనా త్రిష అందాలు మతిపోగొడుతున్నాయి.
తాజాగా త్రిష నుంచి వచ్చిన పిక్ చూస్తే మిల మిల మెరిసే అందం త్రిష సొంతం అంటారేమో, పీచ్ కలర్ ఫ్రాక్ లో త్రిష అలా చూస్తుంటే 40 ప్లస్ లోను అంత అందం త్రిషకు సొంతమనేలా ఉంది అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. త్రిష బ్యూటిఫుల్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.